SSMB 29:సాధారణంగా రాజమౌళి (Rajamouli) ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే.. ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఒక సినిమా ఆయన దర్శకత్వంలో వస్తోంది అంటే.. విడుదలవడానికి మినిమం 2 ఏళ్లకు పైగానే పడుతుందని అందరికీ తెలుసు. అయితే అంతవరకు ఎదురుచూడడం అభిమానుల సాధ్యం కాదు అనడంలో సందేహం లేదు. అందుకే సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) తో అంతర్జాతీయ స్థాయిలో ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు రాజమౌళి. దక్షిణ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా వస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా నటిస్తున్నట్లు మాత్రమే తెలిపారు.
ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ సినిమా నుంచి హీరో, విలన్ హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ అయినా విడుదల చేయాలి అని లేదా గ్లింప్స్ అయినా రిలీజ్ చేయాలని అభిమానులు, సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మెడలో ఉన్న లాకెట్ ను మాత్రమే రిలీజ్ చేసిన రాజమౌళి.. ఆ రోజు నవంబర్లో ఒక పెద్ద సర్ప్రైజ్ తో మీ ముందుకు రాబోతున్నాను అని తెలిపారు. దీనికి తోడు ఇప్పుడు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా నవంబర్ 15న లక్షమంది అభిమానుల మధ్య గ్లోబ్ ట్రోటర్ నిర్వహించబోతున్నట్లు సమాచారం.
also read:HBD Trivikram: చదువులో బంగారు పతకం.. ఉపాధ్యాయుడిగా కెరియర్.. కట్ చేస్తే!
అయితే ఈ అప్డేట్స్ ఇక ఈరోజు నుంచి వరుసగా వెలువడతాయని ప్రకటించడంతో అభిమానులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ.. నేటి నుంచి వరుస అప్డేట్లు వెలువడతాయి.. ఈరోజు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. ఈ ముగ్గురితో సెట్టులో క్లైమాక్స్ షూట్ జరుగుతున్న సమయంలో #GlobeTrotter ఈవెంట్ చుట్టూ చాలా సన్నహాలు జరుగుతున్నాయి ఎందుకంటే మేము ఇంతకుముందు కంటే చాలా ఎక్కువ ప్రయత్నిస్తున్నాం నవంబర్ 15న మీరందరూ దానిని అనుభవించే వరకు వేచి ఉండలేము. దానికి ముందే మీ వారాన్ని మరికొన్ని విషయాలతో నింపుతున్నాము. ఈరోజు పృథ్వీ లుక్ విడుదల చేస్తాం” అంటూ ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ పెంచుకున్నారు? ఇక దీనిని రీపోస్టు చేస్తూ స్మైలీ ఎమోజితో పాటు లవ్ సింబల్ ని పంచుకున్నారు పృథ్వీరాజ్. ఇక ఈ విషయం తెలిసే అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబతున్నారు. హమ్మయ్య ఇన్నాళ్ళ ఎదురుచూపుకు తెరపడింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 7, 2025