భార్యాభర్తలు ఇద్దరూ తెల్లజాతీయులే. కానీ, వారికి ఇద్దరు నల్ల కవలలు పుట్టారు. ఒక్కసారిగా తండ్రి షాకయ్యాడు. ఇద్దరం తెలవాళ్లం అయినప్పుడు నల్ల పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారంటూ నానా రచ్చ చేశాడు. హాస్పిటల్ లో అరిచి గీపెట్టాడు. వాళ్లు నా పిల్లలు కానే కారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. కొద్ది నెలల క్రితం ఆ మహిళ ఇండియాకు వచ్చినట్లు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఉత్తర ప్రదేశ్ లోని పలు పర్యాటక ప్రాంతాల్లో తిరిగినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. ఆమె ఇండియా పర్యటనలో ఏదో జరిగిందని సదరు మహిళ భర్త అనుమానం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఆమె ఇండియా పర్యటనకు నల్ల పిల్లలకు ఏంటి సంబంధం? అసలు ఏం జరిగింది? అనేది తెలుసుకుందాం..
వైరల్ వీడియోలో ఓ మహిళ ఇద్దరు నల్ల నల్లటి కవలకు జన్మనిచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉంది. ఆ పిల్లలను చూసి ఆమె భర్త కోపంతో ఊగిపోతున్నట్లు కనిపించింది. ఆ పిల్లలు తన పిల్లలు కాదని, వారికి తండ్రిగా అంగీకరించేందుకు అతడు ఒప్పుకోవడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇండియాకు ఈ వీడియో లింక్ ఏంటి? అనే విషయంపై కొంత మంది నెటిజన్లు ఆరా తీశారు. ఫ్యాక్ట్ చెక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అప్ లోడ్ చేశారు? నిజమైన వీడియోనా? లేక AI వీడియోనా? అని రకరకాలుగా పరిశీలించి చూశారు.
ఈ వీడియో సోర్స్ ను తెలుసుకునేందుకు కొంత మంది నెటిజన్లు రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించారు. అదే క్లిప్ AI వీడియో క్రియేషన్ టూల్ అయిన InVideo వాటర్ మార్క్ ను కలిగి ఉన్నది. ఈ వీడియో పలు సోషల్ మీడియా సైట్లలో షేర్ చేయబడి ఉంది. అదే వీడియో మరొక వెర్షన్ లో వాటర్‌మార్క్ br_ai_ded ఉంది. ఇది AI-జనరేటెడ్ కంటెంట్‌ను పోస్ట్ చేయడంలో ప్రసిద్ధి చెందిన TikTok అకౌంట్. కింది భాగంలో ‘AI జనరేటెడ్’ అనే టెక్స్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. br_ai_ded ప్రొఫైల్‌ను చెక్ చేసినప్పుడు.. అదే వీడియో వారి TikTok, YouTube అకౌంట్స్ లో అప్ లోడ్ చేయబడిందని గుర్తించారు. ఇలాంటి హాస్పిటల్ వీడియోలు సహా పలు AI జనరేటెడ్ వీడియోలు అందులో కనిపించాయి. మరింత కన్ఫార్మ్ చేసుకోవడానికి వీడియోను AI డిటెక్షన్ టూల్ అయిన హైవ్ మోడరేషన్ ద్వారా చెక్ చేశారు. ఇందులో ఈ వీడియో 100% AI-జనరేటెడ్ గా తేలింది. సో, ఇది నిజమైనది కాదని, AI ఉపయోగించి క్రియేట్ చేశారని తేలిపోయింది.
A video is going viral claiming that a woman in America gave birth to twin babies with dusky skin and black hair 😳 The father was left shocked! Reports say the woman had visited India in February
i think this is an AI generated video your thoughts on this 🧐 pic.twitter.com/PRYFsx4IYL— SilentOrbit (@silentblossom_) November 5, 2025
Read Also: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..