E-Paper
Advertisement

Actress Death: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి.. ఎవరంటే?

Actress Death: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి.. ఎవరంటే?
Advertisement

Actress Death:ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల మరణాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరి మరణం మరువకముందే మరొకరి మరణం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. ఇంకొంతమంది వృద్ధాప్య లక్షణాలతో మరణిస్తున్నారు. ఇప్పుడు ఇంకొక నటి ఏకంగా గుండెపోటుతో మరణించింది. మరి ఆమె ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

గుండెపోటుతో ప్రముఖ నటి మృతి..

ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి , నేపథ్య గాయని అయిన సులక్షణ పండిట్ (Sulakshana pandit). 71 సంవత్సరాల వయసులో గురువారం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెలో నొప్పి ఉందని కుటుంబ సభ్యులతో తెలుపగా.. ఆమెను దగ్గర్లోనే నానావతి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా.. మార్గం మధ్యలోనే చనిపోయినట్లు ఆమె సోదరుడు లలిత్ పండిట్ (Lalith pandit) తెలిపారు. ప్రస్తుతం ఈమె మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. సులక్షణ పండిట్ మరణానికి పలువురు సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

సులక్షణ కెరియర్..

Advertisement

సులక్షణ కెరియర్ విషయానికి వస్తే.. 1970 దశకం ప్రారంభంలో నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 1970లో జితేంద్ర, రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, సంజీవ్ కపూర్, శశి కపూర్, శత్రుఘ్న సిన్హా వంటి ఎంతోమంది అగ్ర నటులతో కలిసి పని చేసిన ఈమె.. 1975లో సంజీవ్ కుమార్ సరసన సస్పెన్స్ థ్రిల్లర్ ఉల్జాన్ మూవీ ద్వారా నటనా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. పరినీతి నవల ఆధారంగా వచ్చిన సంకోచ్ అనే చిత్రంలో లోలితా పాత్ర పోషించిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి నటిగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అలాగే బెంగాలీ చిత్రం బాండి లో కూడా నటించింది. ఇందులో ఉత్తమ్ కుమార్ హీరోగా నటించారు.

నటి మాత్రమే కాదు సింగర్ కూడా…

సులక్షణ పండిట్ నటనతో పాటు సింగర్ గా కూడా తన వృత్తిని కొనసాగించింది. 1967లో వచ్చిన తక్ దీర్ లో లతా మంగేష్కర్ తో కలిసి “సాత్ సముందర్ పార్ సే” అనే ప్రసిద్ధ పాటను పాడి బాల గాయకురాలిగా తన గాన జీవితాన్ని కూడా మొదలుపెట్టింది.. ఒరియా, గుజరాతి, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో పాటలు పాడి పేరు దక్కించుకుంది. ముఖ్యంగా లతా మంగేష్కర్ , మహమ్మద్ రఫీ, యేసుదాస్, మహేంద్ర కపూర్, ఉదిత్ నారాయణ వంటి గాయకులతో పాటలు పాడి సింగర్ గా పేరు సొంతం చేసుకుంది. సులక్షణ కళ్యాణ్ జి ఆనంద్ జి, బొప్పిలాహరి ఉష ఖన్నా, లక్ష్మీకాంత్, శంకర్ జై కిషన్, రాజేష్ ఖయ్యుం , రాజ్ కమల్ వంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడింది.

Advertisement

ALSO READ:Pan India Movies: బడా బడ్జెట్ చిత్రాలు.. బాక్స్ ఆఫీస్ అంచనాలు ఇవే!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×