జపాన్ కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది యువకులు, ముఖ్యంగా జెన్ Z లైంగిక సంబంధానికి దూరంగా ఉంటున్నారట. జెన్ Zలో సగం మందికి 25 సంవత్సరాల లోపు లైంగిక అనుభవం లేదట. 10 మందిలో ఒకరికి 30 సంవత్సరాల వయస్సులోపు ఆ అనుభవం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. పలు దేశాల్లో చిన్న వయస్సులోనే ఎక్కువ మంది లైంగిక సంబంధాల విషయంలో యాక్టివ్ గా ఉన్నప్పటీ, ఇక్కడ పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. జపాన్‌లో 20–49 సంవత్సరాల వయస్సు గల వివాహిత జంటలు కూడా సె*క్స్ కు దూరంగా ఉంటున్నారట. వీరిలో 52% మంది అస్సలు సెక్స్ చేయరట. నెలకు కనీసం ఒకసారి కూడా ఆ పని చేసేందుకు ఇష్టపడరట. ఈ పరిస్థితిని ఆ దేశంలో ‘సెక్స్ లెస్ మ్యారేజెస్’గా పిలుస్తున్నారు.
జపాన్ లో యువత లైంగిక సంబంధానికి దూరంగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. జపాన్ లోని జెన్ Z సాధారణ పో*ర్న్ కంటే హెంటాయ్ అనే యానిమేటెడ్ వీడియోలను ఎక్కువగా చూస్తారు. వారు హెంటాయ్ లోని కథలు, ఫాంటసీని ఇష్టపడతారు. ఇది రియల్ లైఫ్ సె*క్స్ కంటే ఎక్కువ నచ్చుతుందట. జపాన్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హెంటాయ్ వాడకం చాలా పెరిగిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గర్భనిరోధక సమస్యలు కూడా అక్కడి యువత సె*క్స్ కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. బర్త్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ కు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వాటిని కొనడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు. కొందరు గర్భధారణకు భయపడి సెక్స్ కు దూరంగా ఉంటారు. అదే సమయంలో చాలా మంది యువకులకు సె*క్స్ గురించి తగినంతగా తెలియదు. ఎందుకంటే, స్కూళ్లలో దీని గురించి పెద్దగా చెప్పరు. మరో కారణం పని ఒత్తిడి.. జపాన్ యువకులు ఎక్కువ గంటలు పని చేస్తారు. కొన్నిసార్లు వారానికి 70 గంటలు వర్క్ చేస్తారు. డబ్బు గురించి ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. చాలామందికి డేటింగ్ కోసం సమయం, డబ్బు ఉండదు.
యువతలో సె*క్స్ పట్ల ఆసక్తి తగ్గడంపై పలువురు పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి యువత అనిమే అనే యానిమేటెడ్ వినోదాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ నిజమైన సంబంధాలపై ఆసక్తిని తగ్గిస్తుందంటున్నారు. అనిమే ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తింపు పొందింది. Gen Z లో సగానికి పైగా దీనిని చూస్తారు. అనిమే పాత్రలు, హెంటాయ్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల నిజ జీవితంలో లైంగిక ఆనందాన్ని పొందేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇది నిజమైన సె*క్స్ కంటే వర్చువల్ ప్రపంచాలను ఇష్టపడేలా చేస్తుంది. ఇతరులతో రియల్ గా కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. జపాన్‌లో కొంతమంది యువకులు ఒంటరిగా ఉండటానికి ఇది ఒక కారణం. నిజానికి జపాన్ లోనే కాదు, యుఎస్ లాంటి దేశాల్లో చాలా మంది యువకులు బ్రహ్మచారులుగా ఉంటున్నారు.
Read Also: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!