Eesha Rebba (Source: Instragram)
ఈషా రెబ్బా.. 2012లో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే చిత్రం ద్వారా నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈషా రెబ్బా. 1990 ఏప్రిల్ 19న జన్మించిన ఈమె తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది .
Eesha Rebba (Source: Instragram)
ఎంబీఏ చేసిన ఈమె ఫేస్బుక్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేది. అలా ఈమె ఫోటోలు చూసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈమెకు "అంతకు మించి.. ఆ తర్వాత" అనే సినిమాలో అవకాశం కల్పించారు.
Eesha Rebba (Source: Instragram)
ఇక తర్వాత బందిపోటు, అమీతుమీ, మాయ మాల్, దర్శకుడు వంటి చిత్రాలలో నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనా.. అంతకు ముందు.. ఆ తర్వాత అనే సినిమా ద్వారానే గుర్తింపు లభించింది.
Eesha Rebba (Source: Instragram)
ఇక చివరిగా సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'మామా మశ్చీంద్ర' అనే సినిమాలో నటించిన ఈమె .. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది.
Eesha Rebba (Source: Instragram)
తాజాగా స్కై బ్లూ కలర్ లెహంగా ధరించిన ఈమె దానిపై వైట్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించారు. చాలా అందంగా కనిపిస్తున్న ఈమె హంసలాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి యువతను తనవైపు తిప్పుకుంది.
Eesha Rebba (Source: Instragram)
ఇప్పుడు తాజాగా నడుము అందాలతో యువతను ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది.