BigTV English

Sugarcane Juice: చెరుకు రసం తాగుతున్నారా.. ఈ పొరపాటు అస్సలు చేయకండి.. చాలా డేంజర్..!

Sugarcane Juice: చెరుకు రసం తాగుతున్నారా.. ఈ పొరపాటు అస్సలు చేయకండి.. చాలా డేంజర్..!

Sugarcane Juice: సమ్మర్ సీజన్ వచ్చేసింది. వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు వివధ రకార జ్యూస్‌లు, పానీయాలను సేవిస్తూ ఉంటారు. శరీరాన్ని హైడ్రేట్‌గా చల్లగా ఉంచేందుకు పానీయాలు ఎంతో దోహదం చేస్తాయి. అందులో చెరుకు రసం ఒకటి. ఏదైనా శరీరానికి మంచి చేస్తున్నా సరే.. కొన్నిసార్లు అది చాలా దుష్ఫలితాలను కలిగిస్తుంది. చెరుకు రసం వల్ల ఆరోగ్యమే కాదు.. కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


చెరుకు రసంలో చాలా కేలరీలు ఉంటాయి.
చెరుకులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల చక్కెరలో సుమారు 270 కేలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా తాగితే ఊబకాయం, షుగర్ రెండూ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రోజు ఒక గ్లాసు మాత్రమే తాగండి.

నిద్రలేమికి గురయ్యే అవకాశం
చెరుకులో పొలికోసనాల్ ఉంటుందని చెబుతుంటారు. ఇవి శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి నిద్రలేమికి కారణమవుతాయి.


రక్తాన్ని పలుచగా చేస్తుంది
చెరుకు రసంలో పోలికోసనాల్ రక్తాన్ని పలుచుగా అయ్యేలా చేస్తుంది. అందువల్ల చెరుకు రక్తం గడ్డకట్టుకుండా చేస్తుంది. ఇది శరీరం నుండి అధిక రక్తస్రావానికి దారితీస్తుంది.

నిలవ ఉండదు
చెరుకు రసం నిల్వ ఉండదు. ఎక్కువసేపు ఉంటే అది విషపూరితంగా మారుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చెరుకు రసాన్ని 20 నిమిషాలకన్నా ఎక్కువ టైమ్ ఉంచినప్పుడు ఆక్సీకరణం చెందుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే చెరుకరసం తాగాలంటే.. తాజాగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.

చెరుకురసం ఉపయోగాలు

చెరుకురసంలో రుచిగా ఉండటమే కాదు.. ఇందులో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. రోజూ ఒక గ్లాసు చెరుకు రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్ పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. చెరుకురసం అధిక బరువును తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా ఈ కూల్ డ్రింక్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు కూడా చెరుకురసం ఉపయోగపడుతుంది.

గుండె సంబంధిత జబ్బులకు

220 గ్రాముల చెరుకు రసంలో 180 కేలరీల శక్తి ఉంటుంది. పంచదార 30 గ్రాములు మాత్రమే ఉంటుంది. మన శరీరంలో పేరుకుపోయిన ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్, ట్రెగ్లిసెరైడ్స్‌ను కరిగిస్తుంది. వీటివల్లే మనం బరువు పెరుగుతూ ఉంటాము. ఇవి గుండె సంబంధిత జబ్బులకు కూడా కారణమవుతాయి. చెరుకు రసంతో వీటన్నింటినీ ఎదుర్కోవచ్చు.

అధిక బరువును తగ్గడానికి

చెరుకులోని పీచు పదార్ధం క్రొవ్వును కరిగిస్తుంది. ఇది పొట్ట చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్‌ను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. రోజూ గ్లాస్ చెరుకు రసం తాగితే మన శరీరాన్ని అది అటోమేటిగ్గా క్లీన్ చేస్తుంది. అనవసర వ్యర్ధాలను బయటకు పంపుతుంది. ఇలా రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియతో బరువు తగ్గుతారు.

Also Read: బరువు తగ్గేందుకు డైటింగ్, ప్రాణాలు కోల్పోయిన యువతి, ఆమె చేసిన తప్పు ఇదే !

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది

చెరుకు రసం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకో గ్లాస్ చెరుకు రసం తాగడం వల్ల కిడ్నీలు, లివర్ బాగా పనిచేస్తాయి. చాలా రోగాలు నయమవుతాయి. క్యాన్సర్, కామెర్లు వంటివి కూడా తగ్గుతాయి. చెరుకురసం లోని పొటాషియం జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది.

ఎముకలను దృఢంగా ఉంచుతుంది

చెరుకు రసం ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చెరుకు రసంలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×