BigTV English

CM Chandrababu: తల్లి, చెల్లిపై కోర్టుకెక్కిన వ్యక్తి.. జగన్‌పై చంద్రబాబు పంచ్‌లు, అంత మాట అనేశారేంటీ?

CM Chandrababu: తల్లి, చెల్లిపై కోర్టుకెక్కిన వ్యక్తి.. జగన్‌పై చంద్రబాబు పంచ్‌లు, అంత మాట అనేశారేంటీ?

CM Chandrababu: ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. టీడీపీతో మహిళా సాధికారిత ప్రారంభమైందన్నారు. ఈ విషయాన్ని తాము మాటల్లో చెప్పడం లేదని, చేతుల్లో చూపించామన్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు.


తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. తాను విమర్శించాలని అనుకోవడం లేదన్నారు. ఇచ్చిన వాటాలపై కోర్టుకు వెళ్లి తాను ఇవ్వనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి వ్యక్తులు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉంటుందా అని ప్రశ్నించారు. బుధవారం సభలో మహిళా సాధికారితపై సీఎం చంద్రబాబు  సుధీర్ఘంగా మాట్లాడారు.

రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు సీఎం. తల్లికి వాటాలు ఇవ్వలేను, ఇది తన వాటా అని చెప్పే పరిస్థితికి రావడం చాలా బాధగా ఉందన్నారు. మహిళలకు సమాన హక్కులను కల్పించడం ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.


1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఎన్టీఆర్ ఇచ్చారని వివరించారు సీఎం చంద్రబాబు. అప్పటి వరకు ఆస్తిలో సమాన హక్కు లేదన్నారు. ఆడ పిల్లలుంటే పెళ్లి చేసి అత్తింటికి పంపిస్తున్నామని అన్నారు. ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత.. మహిళలు ఇప్పుడు ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.  చాలా గర్వంగా చెబుతున్నామన్నారు. 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారని వివరించారు.

ALSO READ: మండుటెండల్లో మంచి కబురు

1983లో దేశంలో తొలిసారి మహిళా యూనివర్సిటీ ద్వారా ఆడపిల్లలు చదువుకోవాలని స్ఫూర్తి తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ప్రతీ కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాల పెట్టామన్నారు. మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టామన్నారు. ప్రతీ ఐదు కిలోమీటర్లకు హైస్కూల్, మండలానికి జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు. డివిజన్‌కు ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రవేశపెట్టామన్నారు.

విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టాలని నిర్ణయించామని, ఆ రోజు చాలా మంది వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం భార్యభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. వరకట్న సమస్య ఇప్పుడు లేదన్నారు. తిరిగి కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు.

ఎదురుగా ఉన్న మహిళా ఉద్యోగి గురించి వివరించారు. ఆనాడు తాము సంస్కరణలు తీసుకురావడం వల్లే ఆమెకు ఉద్యగం వచ్చిందన్నారు. ఆనాడు బెనిపిషరీ అయితే.. ఇవాళ పాలసీ నిర్ణయం తీసుకునే స్థాయికి చేరారని వివరించారు. ప్రపంచంలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు.

ప్రస్తుతం డ్వాక్రా మహిళలు లేని ఇల్లు ఏపీలో లేదన్నారు. అధికారులు వారి సహకారం తీసుకునే పరిస్థితి వచ్చారన్నారు. దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమమని తెలిపారు. అమరావతి మహిళలు గత ప్రభుత్వంతో వీరోచితంగా పోరాటం చేశారని వివరించారు. రాజధాని కట్టుకోవడానికి వేలాది ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్లు ఇస్తామన్నారు.

ప్రపంచంలో ఎక్కడా జరగని ఎక్స్‌ఫర్‌మెంట్ అమరావతిలో జరిగిందన్నారు. లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని అంతర్జాతీయ దినోత్సవ సభలో హామీ ఇచ్చామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వెయ్యిమంది మహిళలను తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×