Hamsa Nandini (Source: Instragram)(1)
హంస నందిని.. ఈ పేరుకి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అందంతో, నటనతో, యువతను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ.. స్పెషల్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ తెచ్చుకుంది
Hamsa Nandini (Source: Instragram)
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న హంస నందిని.. అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.
Hamsa Nandini (Source: Instragram)
ఇక మధ్యలో చాలా ఏళ్ల తర్వాత జుట్టు మొత్తం తీసేసి గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచింది.. దీంతో అందరూ ఏమైందని తెగ భయపడ్డారు. అంతలోనే తాను క్యాన్సర్ బారిన పడ్డాను అని చెప్పి ఒక్కసారిగా అభిమానుల గుండెను ముక్కలు చేసింది హంస నందిని.
Hamsa Nandini (Source: Instragram)
సెలబ్రిటీలు ఇటు అభిమానులు అందరూ అల్లాడిపోయారు తమ అభిమాన నటి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. చివరికి అందరి ప్రార్థనలు ఫలించాయి . మళ్ళీ మామూలు మనిషి అయ్యారు హంసానందిని.
Hamsa Nandini (Source: Instragram)
ఇక ఇప్పుడు మామూలు స్థితికి వచ్చిన ఈమె.. మీడియా ముందుకు కానీ అటు సినిమాలలో కానీ అవకాశాలు అందుకోలేదు. కానీ చాలా ఏళ్ల తర్వాత బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Hamsa Nandini (Source: Instragram)