Pink Salt Benefits: సాధారణంగా ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు కదా.. మరి ఉప్పుతో అందాన్ని పెంచడం ఏంటనే కదా మీ సందేహం? కానీ ఈ పింక్ సాల్ట్‌తో మీ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా డబుల్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుత జనరేషన్‌లో హిమాలయ పింక్ సాల్ట్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ పింక్ రంగు రాళ్లఉప్పు ఇటు ఆరోగ్యం.. అటు అందం మెరుగుపడుతుంది. మరి, ఈ పింక్ సాల్ట్ మనలో ఎలాంటి బ్యూటీ బెనిఫిట్స్ తీసుకొస్తాయో చూద్దామా..
ఈ పింక్ సాల్ట్.. హిమాలయ పరిసర ప్రాంతాల్లో అధికంగా లభిస్తుంది. అందుకే.. దీన్ని హిమాయల ఉప్పు అని కూడా అంటూంటారు. ఇది లేత గులాభి రంగులో ఉంటుంది. నార్మల్ ఉప్పులో కంటే, ఈ పింక్ సాల్ట్‌తో సోడియం కంటెంట్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయి. సాధారణ ఉప్పు కంటే
ఈ పింక్ సాల్ట్ వాడటం వల్ల అధిక కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
పింక్ సాల్ట్‌ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే.. చర్మాన్ని లోపల నుంచి మెరిసేలా చేస్తుంది. దీంతో చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, క్రిములు, డెడ్ స్కిన్ సెల్స్ అవేవి తొలగిపోతాయి. పింక్ సాల్ట్ మన చర్మకణాల మధ్య ఇరుక్కుపోయిన దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగించడంలో సాయపడుతుంది. అలాగే, ఇది చర్మాన్ని లోపల నుంచి మెరిసేలా చేస్తుంది. అందుకే ఈ రకమైన ఉప్పుతో ఆరోగ్యంతో పాటు అందం కూడా రెట్టింపు అవుతుంది.
పింక్ కలర్ ఉప్పు రాళ్లను తీసుకోవడం వల్ల.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే, ఈ పింక్ సాల్ట్‌తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. సాధారణంగా తెల్లఉప్పు వాడితే, రక్తపోటు పెరుగుతుంది. కానీ, ఈ పింక్ సాల్ట్ అనేది మీ రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. అదుపులో ఉంటుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. పింక్ సాల్ట్ జీవ క్రియను మెరుగుపరిచి, ఉదర సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. హిమాలయ ఉప్పులో డిటాక్సిఫికేషన్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న మలినాలను, వ్యర్థాలను బయటకు పంపుతాయి.