John Abraham : మామూలుగా హీరోయిన్స్‌ను కామెంట్ చేయడం హక్కు అన్నట్టుగా తప్పుగా ప్రవర్తిస్తూ వారిపై తప్పుడు కామెంట్స్ చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాగే హీరోలు కూడా అప్పుడప్పుడు అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కుంటూ ఉంటారు. కానీ హీరోయిన్స్ లాగా హీరోలను కామెంట్ చేసేవారు చాలా అరుదు. ముఖ్యంగా హీరోలను చూసి ఆడవారు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తారని చెప్పినా.. అది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ హీరో.. తన గురించి చాలామంది ఆడవారు అసభ్యకరంగా మాట్లాడారు అని చెప్తూ అందరికీ షాకిచ్చాడు. అంతే కాకుండా ఈ విషయంపై తన ఫ్రెండ్ తన గురించి ఎలా వ్యంగ్యంగా మాట్లాడతారో కూడా బయటపెట్టాడు.
ఫిజిక్ చూపిస్తాను
‘‘నా గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడారు. ఆడవారు అసభ్యకరంగా మాట్లాడగలిగే మగాడివి నువ్వు ఒకడివేనేమో అని నా చుట్టూ ఉన్నవారంతా అంటుంటారు. కానీ దాని గురించి నేనెప్పుడూ తప్పుగా అనుకోలేదు. వాటిని ప్రశంసలలాగానే తీసుకుంటాను. పర్ఫార్మెన్స్ గురించి కంటే లుక్స్ గురించే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనే అంశంపై తరచుగా వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. అందుకే సరైన కథలను ఎంచుకుంటే ఆ కామెంట్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు ఫిజిక్, బాడీని చూడాలని అనుకుంటారు. అలాంటి వారికోసం నేను అది చేస్తాను. దాంతో పాటు కంటెంట్‌కు కూడా ప్రాముఖ్యత ఇస్తాను’’ అని చెప్పుకొచ్చాడు జాన్ అబ్రహం.
ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతుంది
ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోలు మాత్రమే కాదు.. యంగ్ హీరోలు కూడా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. దానిపై కూడా జాన్ అబ్రహం స్పందించాడు. ‘‘ఇప్పటికే హిందీ సినిమా చాలా కష్టాల్లో ఉంది. దాంతో పాటు ఎక్కువగా పారితోషికాన్ని డిమాండ్ చేసి బడ్జెట్‌ను మరింత పెంచకూడదు. అది కరెక్ట్ కాదు. నిజంగానే యాక్టర్లే ఇలా ఆలోచిస్తున్నారా లేక వారి ఏజెంట్స్ వారు ఇలా ఆలోచించేలా చేస్తున్నారా తెలియదు. కానీ అందరూ ఒక ఊబిలో బ్రతికేస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా అసలైన ప్రపంచాన్ని చూడడం ముఖ్యం. ఒక ఇండస్ట్రీగా బాలీవుడ్ చాలా ఇబ్బందులు పడుతుంది’’ అంటూ వాపోయాడు ఈ సీనియర్ హీరో.
Also Read: 37 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక్.. విడాకుల బాట పడుతున్న సీనియర్ హీరో
హీరోలు అలా చేయలేరు
ఈరోజుల్లో ఒక సినిమాను ఎంపిక చేసుకోవడానికి స్టార్ హీరోల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అభిప్రాయం వ్యక్తం చేశాడు జాన్ అబ్రహం (John Abraham). ‘‘ఈరోజుల్లో చాలామంది హీరోలు స్పాట్‌లైట్‌లోనే ఉండాలని అనుకుంటున్నారు. కొందరు మాత్రమే ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులకు చేరితే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకే ఓషెన్ 11 లాంటి సినిమాలు ఇండియాలో చేయడం కష్టం. ఎందుకంటే ఇక్కడ అందరూ హీరోలే కావాలని అనుకుంటారు. ఒక మల్టీ స్టారర్ చేయాలన్నా కూడా ఇద్దరు హీరోల పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఉంటేనే చేస్తారు. ఇద్దరికీ మెయిన్ హీరో కావాలని ఉంటుంది’’ అంటూ ఘాటు కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.