Nagababu:అభిమాని కోరిక తీర్చడానికి మెగా ఫ్యామిలీ ఎంతవరకైనా వెళ్తుంది. కచ్చితంగా మాట నిలబెట్టుకుంటుంది అని మరొకసారి రుజువయ్యింది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు (Nagababu ) ఓ బాబాయ్ కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. తన అన్న చెంతకు చేర్చి ఇచ్చిన మాట ఫుల్ ఫిల్ చేశారు. మరి ఇంతకీ మెగా బ్రదర్ నాగబాబు నిలబెట్టుకున్న ఆ మాట ఏంటి ? అనేది ఇప్పుడు చూద్దాం.ఆ మధ్యకాలంలో ఢీ డాన్స్ షోలో తన డ్యాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేశాడు మురళి బాబాయ్. చిరంజీవి(Chiranjeevi ) నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ‘ఆంటీ కూతురా అమ్మో అప్సరా’ అనే పాటకి స్టేజ్ మీదే దుమ్మురేగ్గొట్టాడు.
ఈ పాటలో ఆ బాబాయ్ డాన్స్ ఎనర్జీని చూసిన చాలామంది సరిగ్గా నిలబడ్డానికి కూడా ఎనర్జీ లేనంత ముసలి వ్యక్తిలా కనిపిస్తున్నారు.అలాంటిది ఇంత ఎనర్జిటిక్ డాన్స్ ఎలా చేశారు అని ఎంతోమంది షాక్ అయిపోయారు. అయితే ఈ మురళీ బాబాయ్ చిరంజీవికి వీరాభిమానట. అందుకే చిరంజీవి సినిమాల్లోని పాటలకి అచ్చం చిరంజీవి ఎలా స్టెప్పులు వేస్తారో ఈయన కూడా అలాగే స్టెప్పులు వేసేవారట. అలా ఆరోజు ఢీ షో ద్వారా ఫేమస్ అయిన ఈ మురళీ బాబాయ్ కి చిరంజీవిని కలవాలనే కోరిక చాలా సంవత్సరాల నుండి ఉందట.అయితే తన కోరికని నాగబాబుకి చెప్పారు. అలా ఓ షోలో చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా అని నాగబాబు అంటే కలవలేదు సర్..కలవాలనేదే నా కోరిక అని సమాధానం ఇచ్చారు.
ఇక ఆయన కోరిక నెరవేరుస్తానని ఆ షోలో నాగబాబు మాట ఇచ్చారు.ఆ తర్వాత మన శంకర వరప్రసాద్ గారు మూవీ సెట్స్ లో చిరంజీవిని కలిసే అవకాశం ఆ బాబాయ్ కు కల్పించారు నాగబాబు. అలా చిరంజీవితో ఆ బాబాయ్ కూర్చొని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో అనిల్ రావిపూడి తో పాటు హైపర్ ఆది కూడా ఉన్నారు. అలా ఫైనల్ గా చిరంజీవిని కలవాలనే కోరికని నాగబాబు ఆ బాబాయ్ కి కల్పించారు. ఇక ఈ విషయాన్ని ఢీ షోలో వీడియో ప్లే చేసి మరీ చూపించారు. అందులో ఆ బాబాయ్ మీరు లేనిదే నేను లేను సార్.. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని మాట్లాడుకుంటూనే ఆనందభాష్పాలు రాల్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది.
అలాగే చిరంజీవి గారిని ఇంత తొందరగా కలుస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఆయన్ని కలిశాను కాబట్టి చచ్చిపోయినా పర్వాలేదు అంటూ స్టేజ్ పైనే ఆ బాబాయ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత హైపర్ ఆది మాట్లాడుతూ.. చిరంజీవి గారు బాబాయ్ తో ఎంతో బాగా మాట్లాడారు.అంతేకాదు ఒక మాట కూడా ఇచ్చారు. చివరికి ఏదో ఒక రోజు నా సినిమాలో నా పక్కన నువ్వు ఒక మూమెంట్ కూడా వేస్తావు. అని మాట ఇచ్చారు అంటూ ఆది చెప్పడంతో ఆ బాబాయ్ చాలా ఎమోషనల్ అయిపోయారు. తాజాగా ఢీ షో కి సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వడంతో మెగా బ్రదర్స్ ఏదైనా అనుకుంటే చేసి తీరుతారు.. అలా నాగబాబు ఆ పెద్దాయన కోరిక తీర్చి పెద్దాయన మొహంలో సంతోషాన్ని నింపారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
The promise is fulfilled 🥺🔥🔥
Thank you @NagaBabuOffl garu ❤️🔥@KChiruTweets ❤️🔥🧿🪬 https://t.co/sbyWDJkuFs pic.twitter.com/Cg9A2zAwUB
— Lord Shiv🥛 (@lordshivom) November 6, 2025