Nellore Accident: ఈ మధ్య కాలంలో రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రజలు బయటికి వెళ్లాలంటేనే బెంబలెత్తిపోతున్నటువంటి పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేడు నెల్లూరు జిల్లాల్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.
పూర్తి సమాచారంలోకి వెళితే..
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పై వేగంగా వచ్చిన స్కార్పియో వచ్చి ఒక వ్యాన్ డీ కొట్టింది .. దీంతో ముందు భాగం మొత్తం డామేజ్ అయిపోయింది. అయితే ఇది కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సమీపంలోని హైవేపై జరిగింది. అయితే ఈ వ్యాన్లో స్కూల్లకు వెళుతున్నటువంటి టీచర్స్ నలుగురు ఉన్నారు. ఆ నలుగురు టీచర్స్ తీవ్ర గాయాలు పాలయ్యారు. దీంతో వారిని అక్కడి స్థానికులు వెంటనే నెల్లూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Also Read: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్
వేగంగా వచ్చి స్కార్పియో ఢీకొనడంతో ఒక్కసారిగా వ్యాన్ ముందు భాగం మొత్తం దెబ్బతిన్నది. అలాగే స్కార్పియో ముందు భాగం కూడా మొత్తం ధ్వంసమైపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు అతి వేగమే కారణమా? లేదా మరేదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.