Bandi Sanjay: నేడు బండి సంజయ్ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. ఈ సమావేశంలో బండి సంజయ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ వివాదాలు, మతపరమైన ఐక్యత, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వంటి అంశాలపై వివరంగా మాట్లాడారు.
అయితే నిన్న బండి సంజయ్ బోరబండా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో “హిందూ ఐక్యత” కోసం పిలుపునిచ్చారు. “మీరు హిందూ రాజ్ కావాలా లేక ఇస్లామిక్ రాజ్ కావాలా?” అని ప్రశ్నిస్తూ.. హిందువుల ఐక్యంగా ఉండాలంటే, ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముస్లిం సమాజాన్ని ఆకర్షించడానికి తలపాగా ధరించినట్టు చెప్పారు. “వోట్ల కోసం తలపాగా ధరించాల్సి వస్తే నా తల కత్తిరించుకుంటాను. నమాజ్ చేస్తానని నటించి ఇతర మతాలను అవమానం చేయను” అని స్పష్టం చేశారు. ఆజరుద్దీన్, ఔవైసీ వంటి ముస్లిం నాయకులు కూడా తలపాగా ధరించకపోతే, రేవంత్ ఎందుకు ధరించారని ప్రశ్నించారు. అలాగే, “రేవంత్ ఆజరుద్దీన్‌కు వక్రతుండ మహాకాయ స్తోత్రం చదివించగలరా? ఒవైసీని భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారి పాట పాడించగలరా?” అని సవాలు విసిరారు.
Also Read: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!
అయితే నేడు బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలని, హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖచిత్రమని, ఇది రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిరగొచ్చని చెప్పారు. అలాగే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ప్రచారాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకు గట్టిగా సవాలు విసిరారు.