Chandrika Ravi Photos: ఒకప్పుడు ఇండియన్ ఇండస్ట్రీని తన గ్లామర్‌తో షేక్ చేసిన సిల్క్ స్మిత బయోపిక్ ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి నటించనుంది. (Image Source: Chandrika Ravi/Instagram)
చంద్రికా రవి ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే తను ఇప్పటివరకు ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అలాంటి నటికి తెరపై సిల్క్ స్మితగా నటించే అవకాశం వచ్చింది. (Image Source: Chandrika Ravi/Instagram)
ఆస్ట్రేలియాలో ఉండే ఇండియన్ ఫ్యామిలీలో జన్మించింది చంద్రికా రవి. మోడలింగ్, యాక్టింగ్‌పై ఇష్టంతో లాస్ ఏంజెల్స్‌కు ప్రయాణమయ్యింది. (Image Source: Chandrika Ravi/Instagram)
16 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టిన చంద్రికా రవి.. 2012లో మిస్ మ్యాక్సిమ్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఫైనల్స్‌లో నిలిచిన మొదటి ఇండియన్ ఒరిజిన్‌గా రికార్డ్ దక్కించుకుంది. (Image Source: Chandrika Ravi/Instagram)
2017లో చంద్రికా రవికి ఒక తమిళ సినిమాలో అవకాశం లభించింది. ఆ తర్వాత తను చేసిన ‘ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు’ మూవీ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. (Image Source: Chandrika Ravi/Instagram)
చంద్రికా రవి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే అడల్ట్ మూవీలో తను కూడా ఒక కీలక పాత్రలో నటించింది. (Image Source: Chandrika Ravi/Instagram)
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ మూవీలో ‘మా బావ మనోభావాలు’ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది చంద్రికా రవి. అప్పటినుండి తనకు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. (Image Source: Chandrika Ravi/Instagram)
ఇలాంటి చంద్రికా రవి ఖాతాలో మరొక రికార్డ్ కూడా ఉంది. అమెరికాలో రేడియో షోను హోస్ట్ చేసే మొదటి ఇండియన్ నటిగా తను రికార్డ్ సాధించింది. (Image Source: Chandrika Ravi/Instagram)
తాజాగా సిల్క్ స్మిత జయంతి సందర్భంగా తన బయోపిక్‌కు సంబంధించిన గ్లింప్స్ విడుదయ్యింది. అందులో రీల్ లైఫ్ సిల్క్ స్మితగా చంద్రికా రవి కనిపించింది. (Image Source: Chandrika Ravi/Instagram)
సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి సరిగ్గా సరిపోయిందని ఈ గ్లింప్స్ చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు. ఈ మూవీ తన కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నారు. (Image Source: Chandrika Ravi/Instagram)