Puri Jagannadh : ప్రస్తుతానికి ఫామ్ లో లేడు కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అంటే పూరీ జగన్నాథ్ పేరు వినిపించేది. బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాథ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు హీరోలంటే ఇలానే ఉండాలి అనే ఒక ఫార్మాట్ ను చెరిపేసి, తెలుగు హీరో అంటే ఇలా కూడా ఉండొచ్చు అని ఆడియన్స్ కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాడు. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఆటిట్యూడ్ తో ఉంటాడు. తనకనిపించిందే చేస్తాడు అని నిరూపించాడు. ముఖ్యంగా ఆటిట్యూడ్ అనే పదం స్టార్ట్ అయింది కూడా పూరి జగన్నాథ్ హీరోలను చూసి అని చెప్పాలి.
పూరీ జగన్నాథ్ స్టార్ హీరోస్ తో కూడా పనిచేశాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో రిపీటెడ్ గా పనిచేసిన పూరి వాళ్లకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం పూరి జగన్నాథ్ కి ఆ హీరోలు డేట్లు ఇచ్చే స్థాయి లో లేరు. ఎందుకంటే పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి వరుస డిజాస్టర్ తో సతమతం అవుతున్నాడు. రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు హిట్ సినిమా లేకుండా పోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
మొదటిసారి లైగర్ అనే పాన్ ఇండియా సినిమాతో తన సత్తాను నిరూపిద్దాం అని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఆ సినిమాతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారు. కొంతమంది పూరీ జగన్నాథ్ ఇంత ముందు ధర్నా కూడా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వాళ్ళ ఇష్యూ క్లియర్ అవుద్ది అని అనుకుంటే, ఆ ఇష్యూ ఇంకా పెద్దదిగా మారి ఆర్థికంగా చితికిపోయాడు.
పూరికి ఆర్థికంగా నష్టపోవడం అనేది కొత్త విషయం ఏం కాదు. ప్రతిసారి ఇలా జరుగుతున్నప్పుడు పూరి ఒక కం బ్యాక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు పూరీ జగన్నాథ్ అలా వస్తాడు అని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే పూరిలో ఆల్మోస్ట్ అంతా అయిపోయిందనే ఆలోచనలోనే చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం పూరి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని నమ్ముతున్నారు. ఏదేమైనా కూడా పూరి సినిమాలు చేయకపోయినా యూట్యూబ్లో తన మ్యూసింగ్స్ తో ఆడియన్స్ ని పలకరిస్తూనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా ట్విట్టర్ వేదికగా పూరి కనక్ట్స్ చెట్టు గురించి ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్ కింద చాలా మంది నెటిజెన్స్ కథ చెప్పమంటే కథలు చెప్తున్నామంటూ చాలామంది పూరిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హీరోల కెరియర్ మాత్రమే కాకుండా డిస్టిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్ కెరియర్ కూడా నాశనం చేశావంటూ చాలా దారుణంగా పూరి పై మండిపడుతున్నారు.
Also Read : Pushpa 2 movie In AP : ఏపీలో అసలు ఏం జరుగుతుంది… పుష్ప 2 రిలీజ్ ఉందా..? లేదా..?