Revanth Reddy Birthday: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8న 57 ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందే ఆయనకు అత్యంత వినూత్న రీతిలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఓ అద్భుతమైన బహుమతిని అందించారు.
సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని గుర్తు చేస్తూ, 57 ఏండ్ల సీఎంకు గుర్తుగా 57 కిలోల సన్నబియ్యంతో ఆయన చిత్రపటాన్ని సృజనాత్మకంగా రూపొందించారు.
మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్నారు. ఆయన ప్రారంభించిన ఉచిత సన్నబియ్యం పథకం వల్ల వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అదే సన్నబియ్యంతో ఆయన చిత్రపటాన్ని తయారు చేయడం ద్వారా మా కృతజ్ఞతను తెలియజేస్తున్నాం అని చెప్పారు.
సీఎం ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాలకే. ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాలని కోరుకుంటున్నాం అని ఆయన అన్నారు.
సాయికుమార్ అందించిన సన్నబియ్యం చిత్రపటం పట్ల ప్రజలు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. “పేదల పట్ల సీఎం చూపిస్తున్న మమకారం గుర్తు చేసే కానుక ఇది అని పలువురు నెటిజన్లు అంటున్నారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న కృషి కారణంగా ప్రజల్లో ఆయనకు విశేష ఆదరణ లభిస్తోంది. పేదల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు, మహిళల సాధికారత, యువతకు ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.
Also Read: కాంగ్రెస్ ప్లాన్ ఇదే.. జూబ్లీహిల్స్ ఈసీలో రైడ్స్ పై బండి సంజయ్ స్ట్రాంగ్ రియాక్షన్
సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బియ్యంతో రూపొందించిన ఈ చిత్రపటం.. పేదల పట్ల ఆయన తపనను ప్రతిబింబించే వినూత్న గుర్తుగా నిలిచిపోనుంది. ఇది కేవలం ఒక గిఫ్ట్ కాదు, రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాల ప్రతీక. సాయికుమార్ సృజనాత్మక ఆలోచన ద్వారా సీఎం పథకాలను గుర్తు చేస్తూ, ప్రజల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు.