Vrusshabha Release: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే ఈయన ప్రధాన పాత్రలో నటించిన “వృషభ” (vrusshabha) సినిమా కూడా విడుదల కానుంది. నందకిషోర్ దర్శకత్వంలో కనెక్ట్ మీడియా, ఏవీఎస్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరికెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే ఈ సినిమా నవంబర్ ఆరవ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇలా నవంబర్ 6న వాయిదా పడటంతో చిత్ర బృందం తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.
ఇక ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వెల్లడించారు. ఈ సినిమా ఏకకాలంలో ఐదు భాషలలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన వీడియోని మోహన్లాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. కొన్ని కథలు సినిమా కంటే ఎక్కువ, అవి వారసత్వాలు. ఈ క్రిస్మస్ సందర్భంగా వృషభ సినిమాలో ఆ వారసత్వం ప్రాణం పోసుకుంటుంది. భావోద్వేగంతో తెరికెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని తెలిపారు.
ఇక చిత్ర బృందం విడుదల చేసిన ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా 1960ల కాలంలో ఒక పల్లెటూరి కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. పశువుల వ్యాధి, ఆధ్యాత్మికత, మనుషులు, పశువుల మధ్య ఉన్న బలమైన బంధం వంటి అంశాలతో ఈ సినిమా రాబోతుందని, ఇందులో భారీ యాక్షన్ సన్ని వేషాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇలా ఎన్నో అంచనాల నేపథ్యంలో వృషభ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Some stories are more than cinema, they’re legacies. This Christmas, witness that legacy roar to life in #Vrusshabha.
A film that celebrates emotion, grandeur, and destiny. Releasing worldwide on 25th December 2025.
#RoarOfVrusshabha #VrusshabhaOn25thDecember #SamarjitLankesh… pic.twitter.com/Dq5yPhYHoQ— Mohanlal (@Mohanlal) November 7, 2025
ఇకపోతే 2025వ సంవత్సరంలోనే మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఈయన నటించిన ఎంపురాన్, తుడరం, హృదయ పూర్వం వంటి మూడు మలయాళ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో కూడా కనిపించే సందడి చేశారు. ఇక ఐదవ సినిమాగా వృషభ సినిమా ద్వారా ఈ ఏడాది మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా సినిమాలపై ఎంతో మక్కువతో గత నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి సేవ చేస్తున్న మోహన్లాల్ కు ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే 2023(Dadasaheb Phalke 2023) పురస్కారం కూడా లభించిన సంగతి తెలిసిందే.
Also Read: The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!