BigTV English
Advertisement

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

World’s Largest Spider Web: హోమ్ సైన్స్ శాస్త్రవేత్తల బృందం 1,11,000 కంటే ఎక్కువ సాలెపురుగులతో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద “సాలీడు గూడు”ను కనుగొన్నారు. సాలెపురుగులు అల్బేనియన్-గ్రీక్ సల్ఫర్ కేవ్ లో ఈ మహాద్భుతమైన సాలీడు గూడును నిర్మించుకున్నాయి. అల్బేనియన్-గ్రీక్ సరిహద్దులో ఈ గుహ ప్రపంచం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఓ చీకటి గుహలో పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద స్పైడర్‌ వెబ్‌ను కనుగొన్నారు. ఇది గుహ గోడలపై ఒక వస్త్రంలా విస్తరించి ఉంది.


సాలె పురుగుల నెట్ వర్క్

సల్ఫర్ గుహ లోపల సాలెపురుగుల ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి 1,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్పెడర్ వెబ్ ను నిర్మించాయి. అక్టోబర్ 17న సబ్‌టెర్రేనియన్ బయాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. రొమేనియాలోని సాపింటియా హంగేరియన్ యూనివర్సిటీ పరిశోధకుడు ఇస్ట్వాన్ ఉరాక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కాలనీలో రెండు సాలీడు జాతులు ఉన్నాయి. బార్న్ ఫన్నెల్ వీవర్ అని పిలువబడే టెజెనారియా డొమెస్టికా, ప్రినెరిగోన్ వాగన్స్ అనే రెండు సాలీడు జాతులు ఈ గూడులో నివసిస్తున్నాయి. వీటిల్లో దాదాపు 69,000 ఒక జాతి, 42,000 మరో జాతి పురుగులు ఉన్నట్లు ఉరాక్ పరిశోధన బృందం అంచనా వేస్తుంది. DNA విశ్లేషణ ఆధారంగా ఈ రెండింటినీ వైరల్ జాతులుగా నిర్ధారించారు.

భారీ వెబ్- రెండు జాతులు

డొమెస్టిక్ హౌస్ స్పైడర్ (టెజెనారియా డొమెస్టికా) అని కూడా పిలువబడే బార్న్ ఫన్నెల్ వీవర్ ఈ సల్ఫర్ గుహ లోపల కనిపించిందని ఉరాక్ బృందం పేర్కొంది. జీవశాస్త్రవేత్త ఇస్తావాన్ ఉరాక్ నేతృత్వంలోని పరిశోధక బృందం అక్టోబర్ 17న గ్రీస్, అల్బేనియా సరిహద్దులో విస్తరించి ఉన్న సల్ఫర్ గుహలోని ఈ భారీ సాలెపురుగు గూడును కనుగొన్నారు. ఈ భారీ వెబ్ 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రెండు అరాక్నిడ్ జాతులు జీవిస్తున్నాయని తెలిపారు. గుహ లోపల, గోడలు, పైకప్పును కప్పి ఉంచే మందమైన సాలీడు గూడును నిర్మించుకున్నాయి. ఒక భాగంలో స్టాలక్టైట్ నిర్మాణాన్ని కూడా నిర్మించాయి.

Related News

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Big Stories

×