Jana Nayagan: విజయ్ థళపతి(Vijay Thalapathy) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “జననాయగన్”(Jana Nayagan). హెచ్ వినోద్ (H.Vinod)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విజయ్ ఆఖరి సినిమా అని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన టివికే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సినిమాలకు దూరం కాబోతున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో హీరో విజయ్ రాజకీయ వ్యవహారాలలో బిజీ కాబోతున్నారు.
ఇక ఈ సినిమాని 2026 జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల చేయబోతున్నట్లు గతంలో నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇటీవల కరూర్ ఘటన కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు తెర దించుతూ చిత్ర నిర్మాతలు ఈ సినిమా వాయిదా పడటం లేదని, అనుకున్న విధంగానే జనవరి 9వ తేదీ విడుదల కాబోతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నవంబర్ 8వ తేదీ ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ విడుదల చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి కూడా ఒక వార్త సంచలనంగా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీలోనే ఏ సినిమాకి కూడా జరగని డీల్ ఈ సినిమాకు జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను కోసం అమెజాన్ ఏకంగా 121 కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. కేవలం డిజిటల్ హక్కుల కోసమే ఈ స్థాయిలో చెల్లించడం అంటే మామూలు విషయం కాదు. ఇది తమిళ సినీ ఇండస్ట్రీలోనే భారీ డీల్ అని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత అమెజాన్ లో ప్రసారమయ్యే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం.
విజయ్ కు జోడిగా పూజ..
ఈ సినిమా ఓటీటీ డీల్ గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అమెజాన్ నుంచి అధికారక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), మమితా బైజు(Mamitha Baiju), బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించగా అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. ఇక విజయ్ చివరిగా గోట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత జననాయగన్ సినిమా ద్వారా రాబోతున్నారు. మరి ఈయన ఆఖరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Vrusshabha Release: మోహన్ లాల్ వృషభ కొత్త రిలీజ్ డేట్… టార్గెట్ క్రిస్మస్