Flight Mode: ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అలాగే తమ ఫోన్లలో ఫ్లైట్ మోడ్ ఆప్షన్‌ను చూసే ఉంటారు. మరి కొన్ని ఫోన్లలో ఇది ఎయిర్‌ప్లేన్ మోడ్ అనే పేరుతో కూడా ఉంటుంది. ఇకపోతే, వీటి పేరుకు తగ్గట్టే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తుంటారు ఎక్కువగా. ఈ ఆప్షన్ ఆన్ చేయగానే ఫోన్‌లోని వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు అన్నీ స్తంభించిపోతాయి. అయితే, విమానాల్లోనే కాకుండా ఫ్లైట్ మోడ్‌తో అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
మన స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ అనేది ఒక ప్రత్యేక ఫీచర్. దీన్ని ఆన్ చేస్తే, ఫోన్‌లోని సెల్యులార్ నెట్‌వర్క్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ సిగ్నల్స్ వంటివి వెంటనే నిలిచిపోతాయి. ఈ ఫ్టైట్ మోడ్‌ను విమాన ప్రయాణంలోనే ఎక్కువగా ఫ్లైట్ నావిగేషన్ వ్యవస్థలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వాడుతారు. ఫ్లైట్ జర్నీలో ఫోన్ సిగ్నల్స్ వల్ల విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌కి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల అన్ని వైర్‌లెస్ సిగ్నల్స్‌ను ఒకేసారి ఆఫ్ చేసి, మొబైల్‌ను ఆఫ్‌లైన్ మోడ్‌లోకి మార్చడం. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో బ్యాటరీని కూడా ఆదా చేయడం, లేదా సిగ్నల్స్ అవసరం లేని పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం ఫ్లైట్ మోడ్‌ను వాడుతారు.
కొన్నిసార్లు ఈ ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం ద్వారా.. సిగ్నల్ సెర్చ్ ఆపివేయడం వల్ల ఫోన్‌లోని బ్యాటరీ ఎక్కువ సేపు వినియోగంలో ఉంటుంది. అంతేకాకుండా.. కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ రాకుండా పని మీద శ్రద్ధ పెట్టవచ్చు. మరో విషయం ఏంటంటే.. ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఛార్జింగ్ పెట్టడం వల్ల మాములు కంటే కాస్త త్వరగా ఛార్జ్ అవుతుంది. ఫోన్ సిగ్నల్స్ ఆఫ్ అవడం వల్ల తాత్కాలికంగా మన చుట్టూ రేడియేషన్ స్థాయి తగ్గుతుంది. అలాగే, ఇదివరకు చెప్పినట్లుగా ఫ్లైట్ జర్నీ ఎలాంటిలో సాంకేతిక అంతరాయం లేకుండా సురక్షిత ప్రయాణం చేయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్స్ ప్రజల సమయాన్ని పూర్తిగా హరించివేస్తోంది. ఈ పరిస్థితిలో సోషల్ మీడియా వాడకం లేదా స్మార్ట్‌ఫోన్ వాడకం నుండి విముక్తి పొందాలనుకునే వారికి, వారి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలనుకునే వారికి ఫ్లైట్ మోడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్స్‌లోని ఫ్లైట్ మోడ్‌ను నెట్‌వర్క్ ట్రబుల్షూటింగ్‌కు మాత్రమే కాకుండా ఈ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చని గమనించాలి.