Silk Smitha Biopic: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ పైకి కనిపిస్తున్న నవ్వులు నిజం కావు. వాటి వెనుక ఎన్నో విషాదమైన గాథలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. ఇక హీరోయిన్స్ కు అయితే చాలా కథలే ఉంటాయి. అన్నింటిని దాటి నిలబడినవారే స్టార్స్ అవుతారు. అలా స్టార్స్ గా నిలబడిన కొంతమంది జీవితాలు కూడా చివరికి విషాదాంతంగానే ముగిసాయి. ఇండస్ట్రీలో తన అందంతో, నటనతో మెప్పించి.. స్టార్ గా ఎదిగి.. చివరికి ప్రశాంతత లేని జీవితం నాకు వద్దు. అందరిని నేను ప్రేమించాను. నన్ను ఎవరు ప్రేమించలేదనే బాధతో, జీవితంలో ఎంత డబ్బు చూసినా, ఎంత స్టార్ డమ్ ను అనుభవించినా అవేమి అసలైన సంతోషం కాదని గ్రహించి.. లోకంలో తనకంటూ ఎవరు లేరని అనుకోని ఒక నటి ఆత్మహత్య చేసుకొని మరణించింది.
రోజా పువ్వును చూసేవారందరూ పైన రెక్కల అందాన్నే చూస్తారు కానీ, దాని కింద ఉన్న ముళ్లను చూడరు. అలా తన అందాన్ని ప్రేక్షకుల ముందు పెట్టి.. వెనుక ముళ్లు లాంటి మోసాలు శరీరాన్ని గుచ్చుతున్న భరించి తన కుటుంబం కోసం కష్టపడిన ఆమెకు చివరికి ఆ కుటుంబమే వెలివేయడంతో తట్టుకోలేక తనకు ఈ భూమి మీద జీవించే హక్కు లేదనుకొని బలవంతంగా ప్రాణాలు విడిచింది. ఆ అందం ఎవరో కాదు .. ఎంతమంది కలలరాణి సిల్క్ స్మిత.
Pushpa2 Song : పీలింగ్స్ పాటలో ఇది గమనించారా..? సుక్కు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావ్..
సిల్క్.. ఇది ఒక పేరు కాదు ఒక బ్రాండ్. ఇప్పుడంటే స్టార్ హీరోయిన్స్ ఐటెంసాంగ్స్ చేస్తున్నారు కానీ, అప్పట్లో ఐటెంసాంగ్స్ చేయడానికి సపరేట్ హీరోయిన్స్ ఉండేవారు. జ్యోతిలక్ష్మీ, జయమాలిని లాంటి సీనియర్స్ ఏలుతున్న టాలీవుడ్ లోకి ఒక డస్కీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. అందంగా లేకపోయినా ముఖంలో కళ ఉంది అని చెప్పి.. చాలామంది అవకాశాలు ఇస్తామని ఆశచూపారు. ఇలా ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొని నిలబడి సిల్క్ స్మిత నటిగా.. కాదు కాదు కుర్రాళ్ళ కలలరాణిగా మారింది.
హీరో కోసం సినిమాకు వెళ్లేవారు ఉంటారు.. హీరోయిన్ కోసం వెళ్లేవారు ఉంటారు. కానీ, కేవలం ఐటెంసాంగ్ కోసం వెళ్లేవారు కూడా ఉన్నారు. అది కేవలం సిల్క్ క్రియేట్ చేసిన రికార్డ్. సినిమా ఎలాంటిది అయినా కానీ, సిల్క్ ఉంటే కాసుల పంటనే. అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా అన్ని ఒకే సాంగ్ లో చూపించి మెప్పించింది. అంతలా స్టార్ డమ్ తెచ్చుకున్న ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు. అందరు ఆమెను మోసం చేసినవారే. ప్రేమ కావాలనుకునే ఆమెకు.. డబ్బు కోసం చెంత చేరి చివరికి చెయ్యి వదిలేసినవారే ఎక్కువ.
NTR Meal: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త ప్రయోగం.. పేదవారి ఆకలి తీర్చేలా..
17 ఏళ్ళ కెరీర్‌లో 450 సినిమాలు.. 5 భాషలు.. సౌత్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న సిల్క్.. తన సొంతవారు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయినా కూడా ఇప్పటికీ ఆమె నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ఉంటుంది. ఇప్పటివరకు సిల్క్ బయోపిక్స్ చాలానే వచ్చాయి. హిందీలో డర్టీ పిక్చర్ పేరుతో ఒక సినిమా, ఆ తరువాత క్లైమాక్స్ అనే పేరుతో ఇంకో సినిమా వచ్చాయి. డర్టీ పిక్చర్ సినిమా తెలుగువారికి కూడా సుపరిచితమే. విద్యా బాలన్ సిల్క్ గా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు సిల్క్ బయోపిక్ లిస్ట్ లో ఇంకొకటి చేరింది. సిల్క్ స్మిత.. క్వీన్ ఆఫ్ సౌత్ అనే పేరుతో ఒక సినిమా రానుంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య పక్కన మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ ఆడిపాడిన చంద్రిక రవి.. ఈ సినిమాలో సిల్క్ పాత్రలో కనిపించబోతుంది. నేడు సిల్క్ వర్థంతి కావడంతో ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
UI The Movie: ఇంత రా అండ్ రస్టిక్ సినిమాలు తీయడం ఉపేంద్రకే సాధ్యం..
ఇక ఈ అనౌన్స్ మెంట్ వీడియోలో సిల్క్ గా చంద్రిక అదిరిపోయింది. మామూలుగానే డస్కీ బ్యూటీతో మెస్మరైజ్ చేసే చంద్రిక.. సిల్క్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. చిన్న స్కర్ట్ వేసుకొని.. కారులో నుంచి దిగి అలా ఆమె నడుచుకుంటూ వస్తుంటే.. అక్కడ ఉన్న చిన్నాపెద్దా ముసలిముతకా అందరు ఆమెవైపు చూస్తూ కనిపించారు. ఇక అంతలా ఆమె అభిమానుల మనసులను చూరగొంది. అలాంటి ఆమె జీవితంలో ఎదుర్కున్న మలుపులు.. మోసం చేసిన వ్యక్తులు.. ఎవరు అనేది ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఇక ఈ బయోపిక్ కు జయరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ బయోపిక్ తోనైనా సిల్క్ మరణానికి అసలు కారణం ఏంటో తెలుస్తుందో లేదో చూడాలి.