Mahesh Kumar Goud: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో.. రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాదులు బలమైన వాదనలు వివరించారని.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారమో యదావిధిగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. గురువారం నుంచి జెడ్పీటీసీ,ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణ ఉంటుందన్నారు.
బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తాం అని తేల్చి చెప్పారు. 1930 ( దాదాపు 90 సంవత్సరాల) తరవాత తెలంగాణలో కుల సర్వే జరిగిందన్నారు. బీజేపీ బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీల కోసం మూడు చట్టాలు తీసుకొచ్చాం. బిల్లుకి అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి అని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. కుల మతాలకు అతీతంగా సిఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతి నిధులు మద్దతు తెలిపారని చెప్పారు. పది నియోజక వర్గాల్లో పాత కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం. 90 శాతం స్థానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుచుకుంటాం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి.. టీటీడీ 2026 డైరీలు, క్యా లెండర్లు
మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్‌లు వేయాలని పార్టీ నాయకులకు చెప్పాము.. ఇప్పటికే ఇంచార్జి మంత్రులు.. ఎమ్మెల్యేలు అభ్యర్దుల ఎంపిక చేసి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు మేం చెప్పినట్టు 42 శాతం రిజర్వేషన్ తోనే ఉంటాయి. తలసాని కి ప్రేమ ఉంటే.. ఇంప్లేడ్ కావచ్చు కదా..? అని ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ అభ్యర్థినీ ఇవాళ.. లేదంటే రేపు ప్రకటిస్తాం అన్నారు. బలమైన నాయకుడు నవీన్ యాదవ్ కాబట్టి.. కేసులు పెడుతున్నారని ఆరోపించారు.