Bigg Boss 9 promo : బిగ్ బాస్ సీజన్ 9 దాదాపు 30 రోజులు దాటి 31వ రోజులకు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు నాలుగు ఎలిమినేషన్లు జరిగాయి. వీళ్ళలో ముగ్గురు కామనర్లు బయటకు వెళ్లిపోయారు. ఇక కొద్దిసేపటికి ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమో చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ లో మరింత రణరంగం చూడబోతున్నామని అవగాహన వచ్చేస్తుంది.
బిగ్బాస్ నిన్న పెట్టిన టాస్కులు ఇద్దరు ప్లేయర్లు కలిసి ఒక టీం గా ఆడుతున్న సంగతి తెలిసిందే. తనుజ కళ్యాణ్ మరియు సుమన్ శెట్టి శ్రీజ ఈ రెండు జంటల్లో ఒక్కో వరస్ట్ ప్లేయర్ ను సెలెక్ట్ చేయాలి అని బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేశారు.
దివ్య మాట్లాడుతూ ఉన్న ఇద్దరిలో కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్. ఫోర్త్ ప్లేస్ నుంచి కళ్యాణ్ అని ఇమ్మానుయేల్ చెప్పాడు. కళ్యాణ్ తనుజాతో క్యాచ్అప్ చేయాలి అనుకుంటున్నాడు అని సంజనా చెప్పింది. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు అని రీతు చౌదరి చెప్పింది.
సాండ్ టాస్క్ మీ చేతిలో ఉంది అది నువ్వు పట్టుకోలేకపోయావు అని మళ్లీ దివ్య కళ్యాణ్ ఉద్దేశిస్తూ అంది. ఇదే విషయాన్ని సంజన కూడా చెప్పింది.
సుమన్ అన్నతో కంపేర్ చేస్తే శ్రీజ బాగా ట్రై చేసింది అంటూ పవన్ చెప్పాడు. శ్రీజ నుంచి 100% ఎఫర్ట్ రాలేదు అని నాకు పర్సనల్ గా అనిపించింది అని ఇమ్మానుయేల్ చెప్పాడు. శ్రీజ వేసిన స్టాటజీల వలనే అందరి గేము పోయింది అంటూ దివ్య శ్రీజను అన్నారు. సుమన్ గారు కూడా 100% ఇవ్వలేకపోతున్నారు అని దివ్య చెప్పింది.
శ్రీజను వరస్ట్ ప్లేయర్ అని చెప్పగానే దివ్యాను ఉద్దేశిస్తూ శ్రీజ అరవడం మొదలుపెట్టింది. ఏదో మనసులో ఇద్దరినీ అంటున్నావు. నేను 100% ఎఫెక్ట్ ఇచ్చాను. ఇద్దరిలో నేను వీకని చెబితే నేను ఒప్పుకోను. శ్రీజ వలన సుమన్ శెట్టి ఎఫర్ట్ ఇవ్వట్లేదు అని నీకు ఎలా తెలిసింది నువ్వు ఆ విషయం ఎలా చెబుతావు అంటూ దివ్య పై విరుచుకుపడింది. వీరిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. నాకు తెలుసు నేను ఇప్పటికే అదే చెప్తాను నువ్వు ఒక వరస్ట్ ప్లేయర్ అంటూ చెప్పింది. వీజ అరుస్తూ ఉంటే అరుచుకో అని తిరిగి సమాధానం ఇచ్చింది దివ్య
Also Read: Bunny Vasu : త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మాట్లాడకండి, వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి