AP Weather Alert: ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రెండు రోజుల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు చెట్ల కింద ఉండవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రాగల మూడు గంటలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కర్నూలు, అనంతపురం మినహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కోనసీమ, అనకాపల్లి, విశాఖ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిశాయి. తిరుపతి జిల్లా దక్కిలిలో 77.2 మి.మీ, అల్లూరి జిల్లా అరకులో 61 మి.మీ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 57.7 మి.మీ, బాపట్ల జిల్లా రామకూరులో 56.5 మి.మీ, అనకాపల్లి జిల్లా పాములవాకలో 48.5 మి.మీ, కడప జిల్లా పులివెందులలో 45.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
Also Read: AP Roads: రోడ్ల మరమ్మత్తులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రూ.1000 కోట్లు మంజూరు
తెలంగాణలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.