Dhanashree Verma: టీమిండియా స్టార్స్ స్పిన్నర్ చాహల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కాగా చాహల్ ఈ మధ్యకాలంలో తన వైవాహిక జీవితంలో విడాకుల అనంతరం హాట్ టాపిక్ గా మారారు. అయితే, చాహల్ పెద్ద ఎదవా అంటూ ఆయన మాజీ భార్య ధన శ్రీ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే…. చాహల్ స్టార్ స్పిన్నర్. ఇతడు తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సక్సెస్ సాధించాడు కానీ వైవాహిక జీవితంలో మాత్రం విఫలమయ్యాడు. చాహల్ నటి ధనశ్రీ వర్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ లాక్డౌన్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వారి రిలేషన్ కొనసాగించిన అనంతరం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అతి తక్కువ సమయంలోనే వీరిద్దరూ విడిపోయారు. వివాహం చేసుకున్న కొన్ని నెలలకే ఇద్దరూ విడివిడిగా ఉన్నారు.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !
ఆ తర్వాత కోర్టు ద్వారా విడాకులు పొందారు. విడాకుల తర్వాత చాహల్ భారీ మొత్తంలో ధనశ్రీకి భరణం చెల్లించారు. అంతేకాకుండా చాహల్ ఎన్నో రకాల ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొన్నారు. తనపై ఎన్నో రకాల తప్పుడు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయినప్పటికీ చాహల్ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. తప్పు అంతా తనదే అన్నట్లుగా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ విషయం పైన చాహల్ ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. విడాకుల అనంతరం వచ్చిన విమర్శలను ఎదుర్కొని నిలబడ్డానని చెప్పారు. ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నానని చాహల్ పేర్కొన్నారు. కానీ దాని గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్లానని చెప్పారు. అయితే ఇదే విషయంపైన తాజాగా ధనశ్రీ వర్మ స్పందించారు.
నా పార్ట్నర్ తప్పు చేశాడని తెలిసినప్పటికీ నేను చాలా సపోర్ట్ చేశాను. ఆ తర్వాత ఆ విషయం పైన ఎంతో పాశ్చాతాపం చెందానని చెప్పారు. వివాహం జరిగిన రెండు నెలల్లోనే అతడు దొరికిపోయాడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మళ్లీ ఇంకోసారి నేను సపోర్ట్ చేయాలని అనుకోవడం లేదంటూ ధనశ్రీ వర్మ అన్నారు. కేవలం కెరీర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానంటూ ధనశ్రీ వెల్లడించారు. ఈ విషయాలను ధనశ్రీ వర్మ తాజాగా ఓ రియాల్టీ షోలో వెల్లడించారు. ప్రస్తుతం ధనశ్రీ వర్మ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీనిపైన చాహల్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !
ఇదిలా ఉండగా చాహల్ విడాకుల అనంతరం ఆర్జే మహ్వాష్ అనే అమ్మాయితో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నారు అంటూ అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ అమ్మాయితో ప్రస్తుతం కలిసే ఉంటున్నాడంటూ సమాచారం అందుతుంది వీరిద్దరూ కలిసి ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది దాని అదే ఏకంగా మూడు లక్షల పైనే ఉందని సమాచారం. ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి దీనిపైన చాహల్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.