SBI UPI Down: ఎస్బీఐ యూపీఐ సేవల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమంది కస్టమర్‌లు UPI పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి. బుధవారం నాడు ఎస్బీఐ కస్టమర్లు యూపీఐ సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో ఎస్బీఐ సోషల్ మీడియాలో స్పందించింది.
ఇవాళ రాత్రి 7.30 గంటలకు యూపీఐ సమస్యను పరిష్కరించామని ఎక్స్ వేదికగా ఎస్బీఐ తెలిపింది. వినియోగదారులు అంతరాయం లేని సేవల UPI లైట్ ను ఉపయోగించాలని ఎస్బీఐ తెలిపింది. కస్టమర్‌లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. మరో ట్వీట్ లో రాత్రి 7:45 గంటల నుంచి యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
మంగళవారం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ సేవలు స్వల్పంగా ప్రభావితమయ్యాయి. డౌన్‌డెటెక్టర్‌లో కూడా ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ పై ఫిర్యాదులు వచ్చాయి. 1,200 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య యూపీఐ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 51% మంది ఫండ్ ట్రాన్స్ ఫర్ లో సమస్యలను ఎదుర్కొన్నారు. అన్ని నిధుల బదిలీలు యూపీఐ ద్వారా చేశారనే దానిపై స్పష్టంగా తెలియలేదు.
“SBI UPIలో మేము తరచూ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాము. దీని కారణంగా కొంతమంది కస్టమర్‌లు యూపీఐ సేవలలో తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు” అని ఎస్బీఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
దేశంలోని నగదు లావాదేవీలకు యూపీఐ అగ్రస్థానంలో ఉంది. తరచూ యూపీఐ సేవల్లో అంతరాయం వీటి వినియోగంపై ప్రభావితం చేస్తుంది.
Also Read: Arattai app: అరట్టై యాప్ నుంచి క్రేజీ అప్ డేట్.. ఇక తగ్గేదే లే!
సెప్టెంబర్ 2025 నాటికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం.. UPI ద్వారా రూ.24.89 లక్షల కోట్ల విలువైన 1,963.34 కోట్ల లావాదేవీలు జరిగాయి. గూగుల్ పే, ఫోన్ పే వంటి అగ్ర శ్రేణి యూపీఐతో పోలిస్తే SBI UPI తక్కువ వాటాను కలిగి ఉన్నప్పటికీ, దేశంలోని అతిపెద్ద బ్యాంక్ కావడంతో టెక్నికల్ సమస్యలతో కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు.