OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు, ఓటీటీలోకి రావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఇప్పుడు రెండు వారాల కూడా అవ్వకుండానే స్ట్రీమింగ్ వస్తున్నాయి. మరి కొన్ని సినిమాలు నెలరోజుల్లో వచ్చేస్తున్నాయి. అయితే నాగ శౌర్య , నిహారిక కొణిదెల నటించిన ‘ఒక మనసు’ మూవీ, ఓటీటీలోకి రావడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా విజయం సాధించకపోయినా, మ్యూజికల్ హిట్ తో, ఒక డీసెంట్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా యూత్ ని ఎక్కువగా అలరించడానికి సిద్దమైంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది ? ఈ స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.
‘ఒక మనసు’ (Oka manasu) 2016లో విడుదలైన తెలుగు రొమాన్టిక్ సినిమా. జీ.వి. రామ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాగశౌర్య, నిహారిక కొనిదెల, మహేష్ అచంత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 జూన్ 24న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ టివి విన్ లో , ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కి వస్తోంది.
Read Also : ఆన్లైన్ లో రీసెల్లింగ్… అర్ధరాత్రి వింత సంఘటనలు… మాస్క్ మ్యాన్ మిస్టరీతో మతిపోగోట్టే సైకలాజికల్ థ్రిల్లర్
ఈ అందమైన ప్రేమ కథ సూర్య, సంధ్య అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఒక పొలిటిషన్ కొడుకు అయిన సూర్య . పాలిటిక్స్ లోకి తన కొడుకు కూడా ఎంటర్ అవ్వాలని అతని తండ్రి అనుకుంటూ ఉంటాడు. సూర్య కూడా ఈ ప్రయత్నంలోనే ఉంటాడు. మరోవైపు సంధ్య మెడికల్ స్టూడెంట్ గా ఉంటుంది. ఇక మొదటి పరీక్షంలోనే వీళ్లిద్దరి మధ్య అట్రాక్షన్ మొదలవుతుంది. ముందుగా సంధ్య అతన్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక వీళ్లిద్దరి మధ్య ప్రేమ మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరి స్ట్రాంగ్ గా మొదలవుతుంది.
అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి వీళ్ళ లవ్ స్టోరీ ఏ మాత్రం ఇష్టం ఉండదు. వీళ్లను విడదీయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో సూర్య తండ్రి వీళ్లను విడదీసేందుకు ఒక పెద్ద ప్లాన్ చేస్తాడు. దీంతో ఈ జంట కొంతకాలం విడిగా ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో సూర్యని విడిచి ఉండలేక సంధ్య ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తుంది. ఆమె తీసుకునే నిర్ణయం ఏమిటి ? ఈ జంటను విడదీయడానికి ఎలాంటి జరుగుతాయి ? అనే విషయాలను, ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూసి తెలుసుకోండి.