OTT Movie : ఈ రోజుల్లో వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అందులోను క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను ఓ రేంజ్ లో ఆరాధిస్తున్నారు. అందుకు తగ్గట్టే కొత్త స్టోరీ లను ఆడియన్స్ ముందుకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ బాలీవుడ్ నుంచి రాబోతోంది. మరో రెండు రోజుల్లో ఓటిటిలో ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎంటర్టైన్ చేయబోతుంది. కొంకనాసేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అలరించబోతోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమి? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘సెర్చ్: ది నైనా మర్డర్ కేస్’ (Search: The Naina Murder Case) 2025లో వచ్చిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి రోహన్ సిప్పీ దర్శకత్వం వహించారు. ఇందులో కొంకోనా సెన్ శర్మా, సూర్య శర్మా, శ్రద్ధా దాస్, వరుణ్ తకూర్ వంటి నటులు నటించారు. ఈ సిరీస్ దాదాపు 8 నుంచి 10 ఎపిసోడ్ లతో రాబోతోంది. ఇది 2025 అక్టోబర్ 10 నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్ కానుంది.
Read Also : వృద్ధాప్యంలో వింత కోరికలు… ఈ గ్రాండ్ మా గారడీ యమా కామెడీ గురూ… 20 ఏళ్ల తరువాత వచ్చిన సీక్వెల్
సంయుక్త అనే పోలీస్ ఆఫీసర్ చాలా నిజాయితీగా డ్యూటీ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె మ్యారేజ్ విషయంలో సమస్యలు ఉంటాయి. భర్తతో కొన్ని చిన్నపాటి గొడవలు ఉండటంతో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ సమయంలో ఆమెకు ఒక పెద్ద కేసు వస్తుంది. నైనా అనే అమ్మాయి అనుమానస్పద స్థితిలో, ఒక పొలిటిషియన్ కారులో చనిపోయి ఉంటుంది. ఈ కేసులో చాలామంది అనుమానితులుగా ఉంటారు. సంయుక్త ఫ్యామిలీ సమస్యలను డీల్ చేసుకుంటూ, ఈ హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడుతుంది.
ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ కొత్త సీక్రెట్స్ బయట పడుతుంటాయి. ప్రతి ఎపిసోడ్ క్లూస్ తో ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ మర్డర్ వెనుక పొలిటికల్ గేమ్ ఉందని, ఇది ఒక హై ప్రొఫైల్ కేసు అని ఆమె తెలుసుకుంటుంది. ఈ కేసును డీల్ చేస్తూనే, తన ఫ్యామిలీ కోసం ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకుంటుంది. అలాగే ఈ కేసులో అసలు హంతకుల్ని కూడా పట్టుకుంటుంది. మరి సంయుక్త పట్టుకున్న ఆ హంతకుడు ఎవరు? ఎందుకు అమ్మాయిని చంపాడు ? ఫ్యామిలీ పరంగా సంయుక్త తీసుకున్న నిర్ణయం ఏమిటి ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.