BigTV English

Kantara Chapter 2 : కాంతార ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే

Kantara Chapter 2 : కాంతార ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే


Kantara Chapter 2: కాంతార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం రూ. 16 కోట్లు పెట్టిన నిర్మించిన మూవీకి ఏకంగా రూ. 400 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవ్వడంతో.. దీనికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 అని తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈ మూవీని రూ. 120 కోట్లు పెట్టి భారీగా నిర్మించారు. దీనికి రిలీజైన 6 రోజులకే రూ. 400 కోట్ల మార్క్ అందుకుంది. అయితే, ఇప్పుడు ఈ కాంతార ఫ్రాంఛైజీపై అభిమానులకు షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

కాంతార చాప్టర్ 1 మూవీ దసరా కానుకగా అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ షోలతో 1వ తేదీ రాత్రి నుంచే ఈ మూవీ థియేటర్స్‌లోకి వచ్చింది. ప్రీమియర్ షోల నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్టాఫ్ సాధారణంగా ఉన్నా.. సెకండాఫ్ లో ఆడియన్స్ కోరుకున్న పింజర్ల దేవుడు కనిపించడం, హీరో రిషబ్ శెట్టి నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా ఆ సినిమా తెరకెక్కించిన లోకేషన్స్, కెమెరా పనితీరు ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. అయితే, కాంతార చాప్టర్ 1 అయిన తర్వాత, దీని తర్వాత మరో సినిమా కూడా ఉంటుందని ప్రకటిచారు. 


కాంతార చాప్టర్ 2 ఇప్పట్లో లేనట్టే ?

కాంతార ఫ్రాంచైజీలో మరో మూవీగా కాంతార చాప్టర్ 2 వస్తుందని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో కాంతార ఫ్రాంఛైజీలో మరో సినిమాను కొద్ది రోజుల్లోనే చూస్తామని అంతా అనుకున్నారు. అలాంటి వారికి ఇప్పుడు షాకింగ్ న్యూస్. కాంతార ఫ్రాంఛైజీలో మూడో భాగమైనకాంతార చాప్టర్ 2 ఇప్పట్లో సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రెడీగా లేరట. వరుసగా రెండు సినిమాలకు డైరెక్షన్ చేసిన రిషబ్ శెట్టి.. కొద్ది రోజుల పాటు మెగా ఫోన్ పై కాకుండా నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత, మళ్లీ కాంతార చాప్టర్ 2పై ఫోకస్ పెడుతారని తెలుస్తుంది .

కథ కూడా రెడీగా లేదట

గత రెండేడు మూడేళ్లుగా రిషబ్కాంతార: చాప్టర్‌ 1 కోసమే వర్క్చేస్తున్నారు. సినిమా నిర్మాణంలో ఉన్నంత వరకు రిషబ్సరిగా ఇంటికి కూడా వచ్చేవారు కాదని ప్రీక్వెల్రిలీజ్టైంలో ఆయన భార్య చెప్పిన సంగతి తెలిసిందే. అంతగా కాంతార: చాప్టర్‌ 1 కోసం రిషబ్కష్టపడ్డారు. ఇప్పుడు దీనికి సీక్వెల్తీసుకురావాలంటే మరో రెండు మూడేళ్లు కష్టపడాలి. అంటే సీక్వెల్తీసుకురావాలంటే రిషబ్కి విరామం తప్పదు. సీక్వెల్కి కథ సిద్దం చేయాలంటే ఫ్రెష్మైండ్కావాలి. అందుకే కాస్తా గ్యాప్తీసుకుని సీక్వెల్పనులు మొదలు పెట్లాలనుకుంటున్నాడు. ఇంతవరకు సీక్వెల్కి లైన్ మాత్రమే దొరికింది. దాన్ని డెవలప్చేయాల్సి ఉంది. ఇంక దీనికి ఇంక కథ కూడా సిద్దంగా లేదు. వెంటనే కాంతార చాప్టర్ 2 పనులు మొదలుపెట్టాలంటే రిషబ్దగ్గర స్క్రిప్ట్ కూడా రెడీగా లేదట. కథ, స్క్రిప్ట్ కోసం లైన్ ఉన్నా.. దాని కథ, కథనంను రిషబ్ శెట్టి ఇంకా రెడీ చేయాల్సి ఉందట.

Also Read: Thalapathy Vijay: కరూర్తొక్కిసలాట ఘటన.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన హీరో విజయ్

రిషబ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్..

రిషబ్ శెట్టి హీరోగా ప్రస్తుతం మూడు అగ్రిమెంట్లు చేసుకున్నాడు. ఒకటి.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న జై హనుమాన్ సినిమా. దీంట్లో హనుమంతుడి పాత్రలో రిషబ్ కనిపించబోతున్నాడు. ఇక రెండో మూవీ… సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఉంది. అశ్విన్ గంగరాజు డైరెక్షన్‌లో పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. మూడో సినిమాగా… ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా సినిమాను చేస్తున్నారు.

కాంతార చాప్టర్ 2 ఎప్పుడంటే ?

రిషబ్ శెట్టి చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి అవ్వాలి. అలాగే కాంతార ఫ్రాంచైజీని నిర్మిస్తున్న హంబోలే ఫిల్మ్స్ కూడా తన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసుకోవాలి. ప్రస్తుతానికి సలార్ 2, కేజీఎఫ్ 2, ఎన్టీఆర్ నీల్ లాంటి పెద్ద సినిమాలు ఈ ప్రొడ్యూసర్స్ చేతిలో ఉన్నాయి. వీటి తర్వాతే కాంతార చాప్టర్ 2 గురించి హంబోలే ఫిల్మ్స్ ఆలోచించే ఛాన్స్ ఉంది.

Related News

Tollywood hero: మిడ్ రేంజ్ హీరో కి దెబ్బ మీద దెబ్బ, వాయిదా పడ్డ మరో ప్రాజెక్ట్

Pawan Kalyan : మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి పీపుల్ మీడియాలో

Deepika Padukone: ఛీ.. డబ్బుల కోసం ఇంత దిగజారతావా.. దీపికాపై నెటిజన్స్‌ ఫైర్‌

Bunny Vasu : త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మాట్లాడకండి, వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి

AA22xA6 : అట్లీ అల్లు అర్జున్ సినిమాపై నోరు విప్పలేదు, తెలివిగా ప్రశ్నను దాటేశారు

‎Zarina Wahab -Prabhas: ప్రభాస్ బాలీవుడ్ హీరోల మాదిరి కాదు.. ప్రశంసలు కురిపించిన నటి!

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో రిపీట్‌… దర్శకుడు య‌దు వంశీతో నిహారిక మ‌రో మూవీ

Big Stories

×