Megha Akash: మేఘా ఆకాష్ రజినీకాంత్‌తో “పెట్టా” అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో నటిగా పరిచయమైంది. ఈ మూవీలో ఆమె సైడ్ రోల్‌లో నటించింది.
ఆ తర్వాత ధనుష్‌కి జోడీగా ‘ఎనై నోకి పాయుమ్ తోట’ అనే మూవీలో అలరించింది.
తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, శింబు వంటి అగ్రహీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
నితిన్‌కు జోడీగా ‘లై’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత చల్ మోహన్ రంగ, గుర్తుండ సీతకాలం, రాజ రాజ చోర, ప్రియమైన మేఘా వంటి పలు చిత్రాల్లో నటించింది.
ఈ భామకు తెలుగులో అంతగా కలిసిరాలేదని చెప్పొచ్చు. తీసిన ఏ మూవీ కూడా హిట్ అందుకోలేక పోయింది.
తెలుగులో గుర్తింపు రాకపోయిన తమిళం, హిందీలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది.
మేఘా ఈ ఏడాది వడక్కుపట్టి అనే మూవీలో నటించింది. ఇక ఇటీవల మాజీ మంత్రి తిరునావుకరసర్ కుమారుడు సాయివిష్ణుతో ప్రేమ విహాహం చేసుకుంది.
మేఘా ఆకాష్ సినిమాల్లో అంతగా బిజీ లేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్‌తో పంచుకుంటుంది.
తాజాగా బ్లూకలర్ శారీలో కుందనపు బొమ్మలా మెరుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.