Parenting Tips: ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లలు అన్ని విషయాల్లో చురుకుగా, ఆరోగ్యంగా, జ్ఞానవంతులుగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల మేధస్సును, జ్ఞాపకశక్తిని పెంచడంలో తల్లిదండ్రులుగా మీరు పోషించే పాత్ర చాలా కీలకం. సరైన వాతావరణం, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ద్వారా మీ పిల్లలను షార్ప్‌గా మార్చేందుకు తోడ్పడే ఎలాంటి చిట్కాలు పాటించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రశ్నించే మనస్తత్వాన్ని ప్రోత్సహించండి:
పిల్లలు ఏదైనా కొత్తగా చూసినప్పుడు లేదా వున్నప్పుడు “ఎందుకు?”, “ఎలా?” అని ప్రశ్నించే విధంగా వారిని ప్రోత్సహించండి. వారి ప్రశ్నలను కొట్టివేయకుండా.. సాధ్యమైనంత వరకు సరళంగా సమాధానాలు ఇవ్వండి. ఇది వారి జిజ్ఞాసను పెంచి, లోతైన ఆలోచనకు దారితీస్తుంది.
2. చదివే అలవాటును పెంపొందించండి:
చిన్నప్పటి నుంచే వారికి కథల పుస్తకాలు, విజ్ఞాన పుస్తకాలు చదివి వినిపించండి. వారు పెరిగే కొద్దీ సొంతంగా చదివేలా ప్రోత్సహించండి. చదవడం అనేది పదజాలం, ఏకాగ్రత, ఊహాపటిమను అపారంగా పెంచుతుంది.
3. ఆరోగ్యకరమైన ఆహారం అందించండి:
మెదడు పనితీరుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (చేపలు, వాల్‌నట్స్), యాంటీఆక్సిడెంట్లు (పండ్లు, కూరగాయలు) వంటి పోషకాలు అవసరం. జంక్ ఫుడ్ తగ్గించి, పౌష్టికాహారం అందించడం ద్వారా మెదడును చురుకుగా ఉండొచ్చు.
4. తగినంత నిద్ర ఉండేలా చూడండి:
పెరుగుతున్న పిల్లలకు మెదడు అభివృద్ధికి, నేర్చుకున్న విషయాలను మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి కనీసం 8-10 గంటల నిద్ర అవసరం. నిద్ర లేమి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
5. ఆటల ద్వారా నేర్పండి:
సాధారణ పాఠాలతో పాటు, పజిల్స్, లెగోస్, చెస్, సుడోకు వంటి ఆటలను పరిచయం చేయండి. ఈ ఆటలు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను , వ్యూహాత్మక ఆలోచనను, తార్కిక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
6. బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొననివ్వండి:
ఇంట్లోనే కాకుండా.. పిల్లలను బయట ఆడుకోవడానికి, ప్రకృతిని గమనించడానికి అనుమతించండి. శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. అంతే కాకుండా ఇది మానసిక ఉల్లాసానికి దోహద పడుతుంది.
7. కొత్త నైపుణ్యాలు నేర్పించండి :
సంగీతం, పేయింటింగ్, లేదా కోడింగ్ వంటి ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునేలా ప్రోత్సహించండి. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మెదడులోని నాడీ కణాలు చురుకై, మొత్తం మేధస్సు మెరుగు పడుతుంది.
Also Read: కాఫీ ఫేస్ మాస్క్‌తో.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం
8. ఒత్తిడి లేకుండా సానుకూల వాతావరణం కల్పించండి:
పిల్లలు నేర్చుకోవడానికి సురక్షితమైన, సానుకూల వాతావరణం అవసరం. అధిక అంచనాలు లేదా ఒత్తిడి వారి సృజనాత్మకతను అడ్డుకుంటాయి. వారి ప్రయత్నాలను ప్రశంసించండి. ఫలితాలను కాదు.
9. సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వండి:
ప్రతి రోజు వారితో వారి లైఫ్ సైల్ గురించి, వారు నేర్చుకున్న కొత్త విషయాల గురించి మాట్లాడండి. ఇది వారి భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్నిమెరుగు పరుస్తుంది. అంతే కాకుండా కుటుంబ బంధాన్ని బలోపేతం చేస్తుంది.
10. పరిమితులతో టెక్నాలజీ వాడకం:
పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచడం అసాధ్యం. కానీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. విద్యాపరమైన యాప్‌లు, కార్యక్రమాలను పర్యవేక్షణలో వినియోగించేలా చూడండి. తద్వారా వారు టెక్నాలజీని నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటారు. వినోదం కోసం కాదు.