BigTV English
Advertisement

Nagachaitanya -Sobhita: శోభితపై ప్రశంసలు కురిపించిన చైతూ… ఆ టాలెంట్ ఎక్కువ అంటూ!

Nagachaitanya -Sobhita: శోభితపై ప్రశంసలు కురిపించిన చైతూ… ఆ టాలెంట్ ఎక్కువ అంటూ!

Nagachaitanya -Sobhita: శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు. ఈమె అచ్చే తెలుగు అమ్మాయిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈమె తన కెరియర్ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. శోభిత (Sobhita)తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈమె తెలుగింటి సినీ కోడలుగా అడుగుపెట్టారు. శోభిత నటుడు నాగచైతన్యను(Nagachaitanya) గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను రెండవ వివాహం చేసుకున్నారు


పల్లెటూరి పిల్లలా..

ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండడం నాగచైతన్య తాజాగా తన భార్య శోభిత గురించి ఎంతో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లికి ముందు శోభిత కాస్త బోల్డ్ గా కనిపించిన పెళ్లి తర్వాత చాలా పద్ధతిగా చీరకట్టులోనే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి నాగచైతన్య మాట్లాడుతూ ముంబైలో ఎంతో దూకుడుగా, ఆత్మవిశ్వాసంతో కనిపించే శోభిత వైజాగ్ లోని తన ఇంటికి వస్తే మాత్రం పల్లెటూరి పిల్లలా సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తుందని, అలాగే తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుందని తెలిపారు. నాకు తెలుగు నేర్పించే టాలెంట్ కూడా తనకు ఉందని ఈయన తన భార్యపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శోభితతో కొత్త ప్రయాణం..

ఇక సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయిన నాగచైతన్య ఇప్పుడు శోభితతో తన వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా ఉందని పలు సందర్భాలలో వెల్లడించారు. ఇక పెళ్లి తర్వాత కూడా శోభిత సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక నాగచైతన్య కెరియర్ విషయానికి వస్తే.. ఈయన చివరిగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.


అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా..

ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విరూపాక్ష సినిమా దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక అడ్వెంచర్-థ్రిల్లర్ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ అంశాలతో కూడుకున్నదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా NC 24 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి సైంటిస్ట్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

Also Read: Dulquer Salman: కోట్లు విలువ చేసే కొత్త కారు కొన్న దుల్కర్.. ప్రత్యేకత ఏంటంటే?

Related News

The Raja saab: రాజా సాబ్ ఫస్ట్ సింగల్ పై తమన్ అప్డేట్.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయా?

Dulquer Salman: కోట్లు విలువ చేసే కొత్త కారు కొన్న దుల్కర్.. ప్రత్యేకత ఏంటంటే?

Vijay Varma: డిప్రెషన్ లో తమన్నా మాజీ లవర్… ఆమె లేకపోతే పిచ్చోడినయ్యానంటూ!

Sandeep Reddy: సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ కన్ఫర్మ్..హింట్ ఇచ్చిన డైరెక్టర్?

Shraddha Kapoor: కొత్త అవతారం ఎత్తిన శ్రద్ధా కపూర్.. ఏకంగా హాలీవుడ్లో!

Bhagya Shri Borse: భాగ్యశ్రీ కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాలా..రామ్ లో ఉన్నాయా?

Jana Nayagan: ఆడియో లాంచ్ కి ముహూర్తం ఫిక్స్.. తమిళనాడులో మాత్రం కాదండోయ్!

Big Stories

×