Dulquer Salman: మలయాళ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ఒకరు. ఈయన కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న దుల్కర్ సల్మాన్ త్వరలోనే కాంత(Kaantha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా ఇటీవల దుల్కర్ సల్మాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈయన విదేశాల నుంచి తక్కువ ధరలకు ఖరీదైన లగ్జరీ కార్లను దిగుమతి చేసుకొని వాటికి ట్యాక్స్ చెల్లించకుండా ఉన్న నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు ఈయన కార్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కార్లకు సంబంధించిన డాక్యుమెంట్లను దుల్కర్ సల్మాన్ కోర్టుకు అందజేయడంతో ఈ విషయంలో కోర్టు నుంచి ఆయనకు ఉపశమనం లభించడమే కాకుండా సీజ్ చేసిన రెండు కార్లను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలను జారీ చేశారు.
ఇక దుల్కర్ సల్మాన్ కు విపరీతమైన కార్లు పిచ్చి అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన గ్యారేజ్ లో సుమారు 60 కి పైగా ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే తాజాగా దుల్కర్ సల్మాన్ మరో కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈయన సుమారు మూడు కోట్లు విలువైన ల్యాండ్ రోవర్ డిపెండర్ 110 ఆక్టా స్పెషల్ ఎడిషన్ కారులో కొనుగోలు చేశారు. అయితే ఇదివరకే దుల్కర్ సల్మాన్ వద్ద ఇదే మోడల్ కారు ఉన్నప్పటికీ మరోసారి ఇదే కంపెనీకి చెందినస్పెషల్ ఎడిషన్ అయిన 110 ఆక్టా ను కొనుగోలు చేశారు. ఇలా అదే కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేయడానికి కారణం లేకపోలేదు. ఈ కారులో స్పెషల్ ఫీచర్స్ ఉన్న నేపథ్యంలోనే మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
కారు ప్రత్యేకతలు విషయానికి వస్తే..
ఈ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్‌ను కలిగి ఉండటం వల్ల కేవలం నాలుగు సెకండ్ల వ్యవధిలోనే నూరు కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.ఇది ఒక ఆల్ వీల్ డ్రైవ్ కారు, కాబట్టి రోడ్లు సరిగ్గా లేకపోయినా, కొండ ప్రాంతాలలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో సునాయసంగా ప్రయాణం చేయగలదు. ఈ కారులో ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్న నేపథ్యంలోనే ఈ కారు దుల్కర్ గ్యారేజ్ కి చేరుకుందని చెప్పాలి. ఇలా ఈయన మరో ఖరీదైన కారును కొనుగోలు చేశారనే విషయం తెలిసిన అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Also Read: Vijay Varma: డిప్రెషన్ లో తమన్నా మాజీ లవర్… ఆమె లేకపోతే పిచ్చోడినయ్యానంటూ!