Telugu Student Dies in USA: అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ఓ యువతి ఉద్యోగానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. ఒంగోలు జిల్లా బాపట్లలోని కారంచేడు గ్రామానికి చెందిన యారగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె రాజ్యలక్ష్మి. టెక్సాస్‌లో ఎం అండ్ ఎం యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించే క్రమంలో అనారోగ్యానికి గురైంది. మూడు రోజులుగా జలుబు ఆయాసంతో బాధపడుతుంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించింది. అయితే ఈ నెల తొమ్మిదిన డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోగా గురువారం రాత్రి నిద్రలోనే కన్ను మూసింది. రాజ్యలక్ష్మి డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు స్నేహితులు, కుటుంబ సభ్యులు. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెట్టి ఉన్నత ఉద్యోగాలు చేస్తాది అనుకున్న తన కుమార్తె ఇలా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.