E-Paper
Advertisement

Vivo Y31 5G Phone Offers: క్రేజీ డిస్కౌంట్ భయ్యా.. వివో Y31 ఫీచర్స్ తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Vivo Y31 5G Phone Offers: క్రేజీ డిస్కౌంట్ భయ్యా.. వివో Y31 ఫీచర్స్ తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Advertisement

Vivo Y31 5G Phone Offers: వివో అభిమానులకు అదిరిపోయే న్యూస్. ఇటీవలే వివో Y31 5G స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్ 23 శాతం తగ్గింపుతో తక్కువ ధరకే లభిస్తోంది. వివో Y31 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ ప్యాక్‌, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇంకా పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ కలిగి ఉంది. భారీ 6.68-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కూడా ఉంది. వివో Y31 5G ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఇలా..

23 శాతం తగ్గింపు:

భారత మార్కెట్లో రూ. 21,499 ధరకు లాంచ్ అయిన వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు 23% తగ్గింపుతో లభిస్తోంది. కేవలం రూ.16,499 ధరకే కొనొచ్చు. యాక్సెస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. వివో Y31 5G ఫోన్‌ కోసం మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.15,840 వరకు తగ్గింపును పొందవచ్చు.

అద్భుతమైన పనితీరు:

Advertisement

వివో Y31 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే వస్తోంది. 1000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందుకుంటుంది. నేరుగా సూర్యకాంతిలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ వివో ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లను కూడా పొందుతుంది. అలాగే పంక్చర్ డ్రాప్ నిరోధకతకు గార్డియన్ గ్లాస్ కూడా ఉంది. ఈ వివో ఫోన్స్ డైమండ్ గ్రీన్, రోజ్ రెడ్ కలర్ ఆప్షన్స్‌తో లభిస్తోంది.

నీటిలోనూ ఫొటోస్ తీయొచ్చు:

ఈ ఫోన్ బ్యాక్ సైడ్.. డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. దీనిలో ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50MP మెయిన్ సెన్సార్ 0.08MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. ఇది ఫోన్ నీటి అడుగున కూడా అద్భుతమైన ఫొటోగ్రఫీకి సపోర్టు అందిస్తుంది.

రెండ్రోజుల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

వివో Y31 5G ఫోన్‌ భారీ 6500mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. సాధారణ వినియోగంలో 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. దీనిని 44W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. 38 నిమిషాల్లో 0 శాతం నుంచి 50శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×