Miheeka Daggubati: మిహీకా బజాజ్.. ఆమె గురించి అంతకు ముందు ఎవరికి తెలియదు. కానీ, ఎప్పుడైతే దగ్గుబాటి ఇంటి కోడలిగా మారిందో ఆమె కూడా సెలబ్రిటీ లిస్ట్ లో చేరిపోయింది.
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిని తన ప్రేమలో కట్టిపడేసి.. అతనికి భార్యగా మిహీకా దగ్గుబాటిగా మారిపోయింది.
2020 కరోనా సమయంలో రానా- మిహీకా వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. వీరిది ప్రేమ వివాహం అని అందరికి తెల్సిందే.
మిహీకా ఒక ఇంటీరియర్ డిజైనర్. ఆమెకు బిజినెస్ లో మంచి గుర్తింపు ఉంది. రానాకు ధీటుగా ఆమె సంపాదన ఉంటుంది.
ఇక మిహీకా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. రానాతో, కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా మిహీకా తన లేటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో మిహీకాకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది.
వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో మిహీకా చాలా స్టైలిష్ గా కనిపించింది. నడుము అందాలు కనిపిస్తున్నా.. ఎబెట్టుగా లేకుండా ఎంతో అందంగా కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. రానా భార్య కూడా హీరోయిన్లకు ధీటుగా అందంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.