BigTV English

Vijay Devarakonda: మేమంతా సేఫ్..కారు ప్రమాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: మేమంతా సేఫ్..కారు ప్రమాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈయన తన నిశ్చితార్థం తర్వాత మొదటిసారి తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తికి వచ్చారు. నిన్న పుట్టపర్తికి చేరుకున్న విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు ప్రశాంతి నిలయానికి చేరుకొని అక్కడి నుంచి సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని నేడు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భాగంగా కారు డామేజ్ కావడంతో అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు.


మేమంతా బాగా ఉన్నాం..

ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ ఈ కారు ప్రమాద ఘటన పట్ల స్పందించి అసలు విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ..”ఈ ప్రమాదంలో కారు దెబ్బతినింది. కానీ మేమంతా బాగానే ఉన్నాము. ఇప్పుడే స్ట్రెంత్ వర్కౌట్స్ పూర్తి చేసి ఇంటికి వచ్చాను. నాకు తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది కానీ బిర్యాని, నిద్ర ఏది బాగుండదు. నాకు తెలుసు ఈ వార్త మిమ్మల్ని బాగా ఒత్తిడికి, ఆందోళనకు గురి చేసే ఉంటుంది. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తాము సేఫ్ గా ఉన్నామని” సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తెలియజేశారు.

కారు ప్రమాదం…

ఈ విధంగా విజయ్ దేవరకొండ తమ ప్రమాద ఘటన గురించి స్పందిస్తూ అంతా బాగున్నాము అని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. విజయ్ దేవరకొండ కారుకు ముందు వెళ్తున్న బొలోరో పశువుల లోడ్ వెళ్తుండగా ఒక్కసారిగా ఆ వాహనం కుడి వైపుకు టర్న్ చేయటంతో వెనుకనే వస్తున్న హీరో విజయ్ దేవరకొండ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కాస్త డామేజ్ అయిందని తెలుస్తోంది.


ఇక కారు లోపల ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు అయితే ఈ ప్రమాదం తర్వాత విజయ్ దేవరకొండ మరొక కారులో అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలా విజయ్ కారకు ప్రమాదం జరిగిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అయ్యారు కానీ ఈయన మాత్రం అంత సేఫ్ గా ఉన్నామని ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఇటీవల నటి రష్మికతో కలిసి నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా నిశ్చితార్థం తర్వాత ఈయన మొదటిసారి తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తికి వెళ్లారు. పుట్టపర్తి నుంచి తిరిగి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Also Read: Pawan Kalyan: పవన్ తో దిల్ రాజు కొత్త సినిమా..రంగంలోకి క్రేజీ డైరెక్టర్!

Related News

Pawan Kalyan: పవన్ తో దిల్ రాజు కొత్త సినిమా..రంగంలోకి క్రేజీ డైరెక్టర్!

Vijay Devarakonda: బ్రేకింగ్ – విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం

Dacoit Release: అడవి శేష్ డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్..వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

Upasana -Klin Kaara: క్లిన్ కారాను అందుకే చూపించలేదు.. ఆ భయమే కారణమా?

Nagachaitanya: నాగచైతన్య ఫెవరేట్ సినిమాలు.. ఒక్కో మూవీ 100 సార్లు చూశాడట

Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!

Big Stories

×