Gold Markets: బంగారం.. దీనికి డిమాండ్ ఎక్కువ.. ఇక మనదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. ఇది సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాలలో బంగారాన్ని కొనుగోలు చేయడం తప్పనిసరి అయిపోయింది. ఈ కారణంగా, దేశంలో బంగారం మార్కెట్ చాలా పెద్దది అనేక నగరాలు బంగారు వ్యాపారానికి కేంద్రాలుగా ఉన్నాయి. బంగారం మార్కెట్లు అంటే కేవలం రిటైల్ దుకాణాలు మాత్రమే కాకుండా, అక్కడ జరిగే వాణిజ్య పరిమాణం, ధరల నిర్ణయం, ఆభరణాల తయారీ, పెట్టుబడికి సంబంధించిన కార్యకలాపాలను కూడా పరిగణించాలి. ఈ అంశాల ఆధారంగా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన టాప్-5 బంగారం మార్కెట్లు, కేంద్రాలను గురించి తెలుసుకుందాం.
1. ముంబై – ఆర్థిక రాజధాని & బులియన్ కేంద్రం
ముంబై భారతదేశ ఆర్థిక రాజధానిగా.. అలాగే దేశంలోని అతిపెద్ద బులియన్ (బంగారం, వెండి) వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
⦿ ఇక్కడ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (MCX) వంటి ప్రధానమైనవి ఉన్నాయి. ఇక్కడ బంగారం ధరలు నిర్ణయిస్తారు. అలాగే జవేరీ బజార్ (Zaveri Bazaar) దేశంలో చాలా ఫేమస్. వేల కొద్ది బంగారం షాపులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలు టోకు వ్యాపారానికి, ఆభరణాల తయారీకి, రిఫైనింగ్‌కు ప్రధాన కేంద్రాలు అవతరించాయి..
⦿ ముంబై మార్కెట్‌లో జరిగే లావాదేవీలు, ధరల కదలికలు దేశవ్యాప్తంగా బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.
2. చెన్నై- దక్షిణ భారతదేశ బంగారం హబ్
⦿ చెన్నై, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారం కొనుగోళ్లకు, వినియోగానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడి ప్రజలు బంగారాన్ని పెట్టుబడిగా, సంపద నిల్వగా చూస్తారు. ఇక్కడ ఉండే టి.నగర్ (T. Nagar) వంటి ప్రాంతాలు అనేక పెద్ద, చిన్న ఆభరణాల దుకాణాలకు ప్రసిద్ధి. ఇక్కడ వందల కొద్ది ఆభరణాల షాపులు ఉంటాయి.
⦿ దక్షిణ భారత సంప్రదాయ ఆభరణాల తయారీలో చెన్నై అగ్రస్థానంలో ఉంది. భారీ రిటైల్ అమ్మకాలు ఇక్కడ జరుగుతాయి.
3. ఢిల్లీ (Delhi) – ఉత్తర భారతదేశ గేట్‌వే
⦿ ఢిల్లీ ఉత్తర భారతదేశంలో అతిపెద్ద బంగారం మార్కెట్‌గా పరిగణించబడుతుంది. ఇక్కడ అనేక అంతర్జాతీయ, దేశీయ బులియన్ దిగుమతులు, పంపిణీకి కేంద్రంగా పనిచేస్తుంది. చాందినీ చౌక్ ప్రాంతం ముఖ్యంగా టోకు ఆభరణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది.
⦿ ఇక్కడ వివాహ, పండుగలకు సంబంధించిన బంగారు ఆభరణాల వినియోగం చాలా ఎక్కువ. ఢిల్లీ ధరలు ఉత్తర భారత మార్కెట్లకు సూచికగా ఉంటాయి.
4. హైదరాబాద్ (Hyderabad) – తెలుగు రాష్ట్రాల కేంద్రం
⦿ హైదరాబాద్ బంగారం వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ముఖ్య కేంద్రం. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వినియోగదారులు వస్తారు. పాతబస్తీలోని లాడ్ బజార్ వంటి ప్రాంతాలు ఆభరణాల తయారీకి పేరుగాంచాయి.
⦿ పెద్ద రిటైల్ చైన్‌లతో పాటు, స్థానిక నగల వ్యాపారులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇది మార్కెట్‌ను చైతన్యవంతంగా ఉంచుతుంది. స్థానిక సంప్రదాయ ఆభరణాలకు ఇక్కడ అధిక డిమాండ్ ఉంది.
5. కోల్‌కతా (Kolkata)
⦿ కోల్‌కతా తూర్పు భారతదేశంలోని అతిపెద్ద, పురాతనమైన బంగారం మార్కెట్‌లలో ఒకటి. ఇక్కడి బరాబజార్ (Barabazar), బురాబజార్ (Burrabazar) ప్రాంతాలు సాంప్రదాయ బెంగాలీ ఆభరణాల తయారీకి, టోకుచ రిటైల్ అమ్మకాలకు ప్రసిద్ధి.
⦿ బెంగాలీ సంప్రదాయ ఆభరణాల రూపకల్పనలో కోల్‌కతాకు ప్రత్యేకత ఉంది. కళాత్మక నైపుణ్యం కలిగిన ఆభరణాల తయారీదారులు ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నారు.
⦿ ఈ ఐదు నగరాలు భారతదేశంలో బంగారం వాణిజ్య, సాంస్కృతికచ ఆర్థిక ప్రవాహాన్ని నడిపిస్తాయి. ప్రతి మార్కెట్ తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ, ముంబై ఆర్థిక కేంద్రంగా, చెన్నై, హైదరాబాద్ నగరాలు వినియోగ కేంద్రాలుగా, ఢిల్లీ, కోల్‌కతా ఉత్తర, తూర్పు ప్రాంతాల గేట్ వేలుగా దేశ బంగారు వ్యాపారానికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. ఈ మార్కెట్ల ఉమ్మడి ప్రభావం వలన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారులలో ఒకటిగా ఉంది.
ALSOP READ: RRC: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2094 ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే జాబ్