Tazmin Brits: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ (ICC Womens World Cup 2025 ) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ఇవాల్టి మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా (New Zealand Women vs South Africa Women ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ రెండు జట్ల మధ్య ఫైట్ జరిగితే సౌత్ ఆఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సౌత్ ఆఫ్రికా జట్టుకు సంబంధించిన తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits ) అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కేవలం 89 బంతుల్లో 101 పరుగులు చేసి తజ్మిన్ బ్రిట్స్ దుమ్ము లేపింది. దీంతో ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదు సెంచరీలు చేసిన ఏకైక మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. అయితే సెంచరీ చేసిన తర్వాత రాముడి తరహాలో ఆమె సెలబ్రేషన్స్ చేసుకున్న సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో సఫారీ కి చెందిన తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits ) అరుదైన రికార్డు సృష్టించారు. ఈ 2025 సంవత్సరంలో ఆమె ఏకంగా ఐదు సెంచరీలు నమోదు చేశారు. ఇవాళ 89 బంతుల్లో 101 పరుగులు చేసిన తజ్మిన్ బ్రిట్స్… ఐదో సెంచరీ నమోదు చేసుకుంది. ఈ సెంచరీ నమోదు అయిన తర్వాత రాముడు బాణం వదిలినట్లుగానే, ఆమె కూడా బ్యాట్ కింద పెట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఒకే సంవత్సరంలో ఐదు సెంచరీలు చేసిన సరికొత్త రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ తజ్మిన్ బ్రిట్స్ పేరుపైన నమోదు అయింది. ఇవాళ న్యూజిలాండ్ మహిళల జట్టుపై సెంచరీ చేయడంతో ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన రికార్డు కూడా బద్దలు కొట్టింది. అంతకు ముందు 2025లో ఒకే సంవత్సరంలో స్మృతి మందాన నాలుగు సెంచరీలు చేసింది. 2024 లో కూడా నాలుగు సెంచరీలు నమోదు చేసింది స్మృతి మందాన. అయితే తజ్మిన్ బ్రిట్స్ ఈ ఏడాది 5 సెంచరీలు నమోదు చేసి ఇప్పుడు చరిత్ర సృష్టించింది.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మహిళల సౌతాఫ్రికా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 47.5 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ మహిళల జట్టు 231 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి చేధించింది సౌత్ ఆఫ్రికా. 40.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన సౌతాఫ్రికా, 234 పరుగులు సాధించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా.
Tazmin Brits just reminded everyone — it’s DIWALI MONTH! 💥🪔
An ODI World Cup hundred in just 87 balls while chasing 232 against the Kiwis!
That’s 4️⃣ hundreds in her last 5️⃣ ODIs! 🔥 #CWC25 #NZvsSA #CWC #TazminBrits | 📸 : JioStar pic.twitter.com/FPrfJv7Cpc
— OneCricket (@OneCricketApp) October 6, 2025