Naga Chaitanya- Sobhita Marriage: ఎట్టకేలకు అక్కినేని వారసుడు మళ్లీ పెళ్లి పీటలు ఎక్కాడు. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య.. హీరోయిన్ సమంత ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెల్సిందే.
సమంతతో విడిపోయాక.. చై, మరో నటి అయిన శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడు.
ఈ ఏడాదిలోనే వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఇక పెళ్లి డిసెంబర్ 4 న జరగనుందని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ నేడు ఈ జంట మూడు ముళ్ళతో ఒక్కట్టయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది.
పెళ్లి తరువాత కొడుకు, కోడలు పెళ్లి ఫోటోలను నాగార్జున అభిమానులతో షేర్ చేస్తూ నూతన వధూవరులను ఆశీర్వదించామని కోరాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి జరగడంతో చై- శోభితాలకు ఏఎన్నార్ ఆశీస్సులు కూడా ఉన్నాయని నాగ్ చెప్పుకొచ్చాడు.
ఇక పెళ్లి దుస్తుల్లో నూతన వధూవరులు ఎంతో అందంగా కనిపించారు. గోల్డ్ కలర్ పట్టు చీరలో శోభితా.. పట్టు పంచెలో చై చూడముచ్చటగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.