Google Maps: దారి తెలియని ప్రయాణీకులు చేసే మొదటి పని గూగుల్ మ్యాప్ ను ఫాలో కావడం. అయితే, ఒక్కోసారి గూగుల్ ను గుడ్డిగా నమ్మితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా ఫరీదాబాద్ లో గూగుల్ మ్యాప్ పుణ్యమా అని ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాలపూర్ లోనూ సేమ్ అలాగే జరిగింది. కానీ, తృటిలో ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపట్టారు.
గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ కెనాల్ లోకి..
తాజాగా యూపీలో గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ కారులో వెళ్తున్న ముగ్గురు యువకులు క్షణాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రాయ్ బరేలీ – పిలిభిత్ దారిలో గూగుల్ మ్యాప్ ను చూస్తూ వెళ్లిన కొంత మంది యువకులు కారుతో సహా నేరుగా కెనాల్లోకి దూసుకెళ్లారు. ఆ యువకులకు ఈత రావడంతో తప్పించుకుని బయటపడ్డారు. బరేలీలోని ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలాపురా కెనాల్ దగ్గర ఈ ఘటన జరిగింది.
పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం
యూపీలోని కాన్పూర్ జిల్లాకు చెందిన దివ్యాన్షు సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పిలిభిత్ లో జరిగే ఓ పెళ్లి వేడుకలకు బయల్దేరాడు. ఆ రూట్ లో తను ఎప్పుడూ జర్నీ చేయలేదు. దారి సరిగా తెలియదు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాడు. దాన్ని ఫాలో అవుతూ కారు నడుపుతున్నాడు. బర్కాపూర్ సమీపంలోకి రాగానే గూగుల్ మ్యాప్ కాలాపూర్ కెనాల్ వైపు చూపించింది. ఆయన అలాగే ఫాలో అవుతూ వెళ్లి కెనాల్ లో కారుతో సహా పడిపోయారు. సుమారు 15 ఫీట్ల మేర కాలువలోకి వెళ్లిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. కారు వేగంగా నడపడంతో తిరిగి పడినట్లు స్థానికులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రేన్ సాయంతో కాలువలో పడిపోయిన కారును బయటకు తీయించారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన వరదల కారణంగా రోడ్డు కోతకు గురి కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.
10 రోజుల్లో రెండో ప్రమాదం
గత నెలలో ఇదే జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిజ్జి మీది నుంచి కారు నదిలోకి పడిపోయిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ వెళ్లి బ్రిడ్జి మీద నుంచి కారుతో సహా 50 అడుగుల కిందికి పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో యూపీ పోలీసులు గూగుల్ మ్యాప్స్ మీద కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఘటన జరగడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. అయితే, గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా ఫాలో కావడం మంచిదికాదంటున్నారు నిపుణులు. దారి సరిగా తెలియనప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు. గూగుల్ మ్యాప్ నేవిగేషన్ ఉన్నప్పటి జాగ్రత్తగా వాహనాలను నడపాలంటున్నారు. లేదంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Read Also: జాగింగ్ కి వెళ్లి వచ్చేసరికి అమ్మా చెల్లి నాన్న మర్డర్, మరీ ఇంత ఘోరంగానా?