OTT Movie : జాతి విద్వేషం వల్ల చాలా దేశాలలో ఇప్పటకీ మారన హోమాలు తప్పడం లేదు. అమెరికా లాంటి దేశాలే, ఈ సమస్యతో వనికిపోతున్నాయి. ఇలాంటి విద్వేషం వల్ల, ఒక్కో సారి అల్లరి మూకలు విధ్వంసాలు సృష్టిస్తుంటారు. అయితే వీటిలో ఎక్కువగా అమాయకులు బలవుతుంటారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా, ఇండోనేషియాలో బాక్సాఫీస్ హిట్ ను బద్దలు కొట్టింది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. 1998లో చైనీస్ ఇండోనేషియన్స్‌పై జరిగిన దారుణ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ఒక బలమైన సోషల్ మెసేజ్ ని కూడా ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది సీజ్ అట్ థార్న్ హై’ (The Siege at Thorn High) 2025లో వచ్చిన ఇండోనేషియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. జోకో అన్వర్ దీనికి దర్శకత్వం అందించారు. ఇందులో మోర్గాన్ ఓయ్, ఓమారా ఎన్. ఎస్టెఘలాల్, హానా మలాసన్, ఎండీ అర్ఫియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 17న అమెజాన్ MGM స్టూడియోస్ ద్వారా రిలీజ్ అయ్యింది. 2 గంటల నిడివితో, IMDbలో 6.6/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
1998లో ఇండోనేషియాలో సెటిలర్స్ అయిన చైనీస్ పై దాడులు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఎడ్విన్ అనే యువకుడు, అతని సోదరి సిల్వీ బస్సులో ఇంటికి వెళ్తుంటారు. నిరసన కారులు బస్సును ఆపి, సిల్వీపై దాడి చేస్తారు. ఆమె చైనీస్ కావడంతో ఆమెపై దారుణంగా అఘాయిత్యం చేస్తారు. అప్పుడు ఎడ్విన్ ఆమెను కాపాడలేకపోతాడు. దీంతో కొద్దిరోజుల తరువాత ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ బిడ్డను దూరంగా వదిలేస్తుంది. ఒక రోజు సిల్వీ అనారోగ్యంతో చనిపోతూ, తన కొడుకును కనిపెట్టి రక్షించమని ఎడ్విన్‌తో మాట తీసుకుంటుంది. 18 సంవత్సరాల తర్వాత (2027లో) ఎడ్విన్ ఒక టీచర్‌గా పని చేస్తూ, తన సోదరి కొడుకును కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. దీని కోసం థార్న్ అనే జువెనైల్ హై స్కూల్‌లో టీచర్ గా జాయిన్ అవుతాడు.
ఈ స్కూల్ రౌడీ టీనేజర్లతో చాలా వైలెంట్ గా ఉంటుంది. ఈ స్కూల్ లో ఎడ్విన్‌కు సమస్యలు మొదలవుతాయి. స్టూడెంట్స్‌లో జెఫ్రీ అనే రౌడీ లీడర్, చైనీస్ ప్రజలపై కోపంతో ఉంటాడు. జెఫ్రీ, అతని గ్యాంగ్ ఎడ్విన్‌ను ఇబ్బంది పెడతారు. అయితే ఎడ్విన్ తన సోదరి కొడుకు ఎవరో కనిపెట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు. కానీ జెఫ్రీ గ్యాంగ్ అతన్ని టార్గెట్ చేస్తుంది. ఈ సమయంలో, జకార్తాలో మళ్లీ 1998లా హింసతో కూడిన అల్లర్లు మొదలవుతాయి. అల్లరో మూకలు స్కూల్ పై దాడి చేస్తారు. స్కూల్ లాక్‌డౌన్ అవుతుంది. లోపల ఎడ్విన్, కొంతమంది టీచర్స్, స్టూడెంట్స్ చిక్కుకుంటారు. ఇప్పుడు జెఫ్రీ గ్యాంగ్ ఎడ్విన్‌ను చంపాలని ప్లాన్ చేస్తుంది.
ఆ స్కూల్‌లో హింస పెరుగుతుంది. ఈ సమయంలో ఎడ్విన్ ఒక షాకింగ్ సీక్రెట్ తెలుసుకుంటాడు. తన సోదరి కొడుకు ఎవరో కాదు జెఫ్రీనే. జెఫ్రీ తన తల్లి గురించి తెలుసుకుని, ఎడ్విన్‌ను టార్గెట్ చేస్తాడు. ఈ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ తో రసవత్తరంగా సాగుతుంది. చివరికి ఎడ్విన్ , జెఫ్రీ గొడవ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ