BigTV English

OTT Movie : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్

OTT Movie : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్

OTT Movie : ప్రపంచంలో నేరాలు ఎక్కువగా డబ్బు, అక్రమ సంబంధాల వల్లే జరుగుతున్నాయి. వీటి బారిన పడకుండా ఎవ్వరూ ఉండటంలేదు. అయితే కొన్ని చిన్న స్థాయిలో జరిగితే, మరికొన్ని పెద్దస్థాయిలో జరుగుతుంటాయి. ఫైనల్ గా ఒక క్రైమ్ అయితే జరుగుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, అక్రమ సంబంధం వల్ల, ప్రతీకారం ఎంత దూరం వెళ్తుందో చూపిస్తుంది. భార్యా,భర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో కథ పీక్స్ కి వెళ్తుంది. ఈ స్టోరీ సస్పెన్స్ తో మరింత ఇంట్రెస్టింగా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘లవింగ్ అడల్ట్స్’ (Loving adults) 2022లో వచ్చిన డానిష్ థ్రిల్లర్ సినిమా. బార్బరా టాప్‌సో దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్టియన్ (డార్ సాలిమ్), లియోనోరా (సోంజా రిక్టర్), క్సెనియా (మిక్కెల్ బో ఫోల్స్‌గార్డ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 ఆగస్టు 26న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. 1 గంట 44 నిమిషాల నిడివితో, IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

డెన్మార్క్‌లో క్రిస్టియన్, లియోనోరా అనే జంట నివశిస్తుంటారు. వీళ్ళు 20 ఏళ్లుగా వైవాహిక జీవితంలో ఉన్నారు. క్రిస్టియన్ ఒక కాంట్రాక్టర్, లియోనోరా ఒక పోలీసు కమిషనర్. వాళ్లకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ ప్రస్తుతం వాళ్ల మధ్య ప్రేమ తగ్గిపోయింది. క్రిస్టియన్‌కు క్సెనియా అనే అమ్మాయితో అఫైర్ ఉందని లియోనోరాకు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి లియోనోరా షాక్ అవుతుంది. కోపంతో ఏం చేయాలో అర్థం కాదు. ఆమె క్రిస్టియన్‌ను వాచ్ చేస్తూ, అతని అఫైర్ గురించి కన్ఫర్మ్ చేసుకుంటుంది. క్రిస్టియన్ కూడా లియోనోరాపై డౌట్ పడతాడు. ఇప్పుడు వాళ్ల మధ్య టెన్షన్ పెరుగుతుంది.


లియోనోరా కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. క్సెనియాను చంపాలని అనుకుంటుంది. దీనికి తగ్గట్టు ఒక ప్లాన్ కూడా వేస్తుంది. క్రిస్టియన్‌కు కూడా లియోనోరా ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. అతను కూడా ఆమెను వాచ్ చేస్తాడు. వాళ్ల మధ్య గొడవలు, సీక్రెట్స్ బయటపడతాయి. వాళ్ల కొడుకు ఈ గొడవల మధ్యలో ఇరుక్కుంటాడు. ఈ సినిమా ఎవరు ఎవరిని చంపబోతున్నారు, ఎవరు సేఫ్ అవుతారనే సస్పెన్స్‌తో నడుస్తుంది. లియోనోరా, క్రిస్టియన్ ఒకరినొకరు ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్‌లో మర్డర్ ప్లాన్స్ బయట పడతాయి. లియోనోరా, క్రిస్టియన్ ప్లాన్స్ ఒకదానితో ఒకటి క్లాష్ అవుతాయి. ఒక షాకింగ్ ట్విస్ట్‌లో, ఎవరో ఒకరు చనిపోతారు. కానీ ఎవరనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మరెందుకు ఆలస్యం ఈ థ్రిల్లింగ్ సినిమాని చూసి మీరు కూడా చిల్ అవ్వండి.

Read Also : దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

Related News

OTT Movie : తమ్ముడి ముందే అక్కను దారుణంగా… మేనల్లుడి రివేంజ్ కి గూస్ బంప్స్ … క్లైమాక్స్ అరాచకం

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఏం సినిమా మావా… ఇద్దరు పిల్లలున్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పనోళ్ళు… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

Big Stories

×