MS Dhoni: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి జరగబోయే వన్డే సిరీస్ నేపథ్యంలో జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India). అయితే ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ ని తొలగించింది గౌతమ్ గంభీర్, అగార్కర్ బృందం. వీళ్ళిద్దరూ కుట్రలు చేసి మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని బయటకు పంపిస్తున్నారని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మహేంద్రసింగ్ ధోని ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కోహ్లీ అలాగే రోహిత్ శర్మాను బయటకు పంపించారు కానీ, మహేంద్ర సింగ్ ధోనీని మాత్రం ఎవడు టచ్ కూడా చేయలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీని బలవంతంగా టీమిండియా నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న వార్తలు బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీకి ఉన్న కెప్టెన్సీ ని అప్పట్లో బలవంతంగా లాగేసుకున్నారు. అప్పుడు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షులుగా ఉన్న సంగతి తెలిసిందే. గంగూలీ వర్సెస్ కోహ్లీ అన్నట్లుగా వ్యవహారం అప్పట్లో నడిచింది. దాంతో అప్పట్లో కోహ్లీ కెప్టెన్సీ ని పీకేశారు. అనంతరం సాధారణ ప్లేయర్ నే జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు వన్డేల్లో కూడా అతడు గుడ్ బై చెప్పే ప్రమాదం పొంచి ఉంది. ఆ దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెషర్ పెడుతోంది.
ఇటు రోహిత్ శర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే టీమిండియా హెడ్ కోచ్ అయ్యాడో, అప్పటినుంచి రోహిత్ శర్మకు అన్ని షాకులే తగులుతున్నాయి. ముందుగా టెస్టు కెప్టెన్సీ నుంచి ఇటీవల రోహిత్ శర్మను తొలగించారు. దీంతో ఆ టెస్ట్ ఫార్మాట్ కు రోహిత్ శర్మ రిటైర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వన్డే కెప్టెన్సీ కూడా పీకి పరేశారు. ఇలా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలు బలవంతంగా రిటైర్మెంట్లు తీసుకునే పరిస్థితి తీసుకువచ్చింది బీసీసీఐ. కానీ మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. మహేంద్ర సింగ్ ధోని చెప్పింది అప్పట్లో వేదం. బీసీసీఐ రూల్స్ కాదు, ధోని రూల్స్ అందరూ పాటించాలి. అలా ఉండేది అప్పట్లో పరిస్థితులు.
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు టీమిండియాలో ఎలాంటి పాలిటిక్స్ రాలేదు. అలా ధోని అన్ని చూసుకున్నాడు. గౌతమ్ గంభీర్ లాంటి ప్లేయర్లను తొక్కిపడేశాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ, జడేజా అలాగే అశ్విన్ లాంటి ప్లేయర్లను తెరపైకి తీసుకువచ్చి టీమిండియాను కాపాడాడు. అదే సమయంలో టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్ ట్రోఫీ విజేతగా టీమిండియాను ధోని నిలిపాడు. దీంతో బీసీసీఐ కూడా పల్లెత్తు మాట అనలేకపోయింది. అటు రిటైర్మెంట్ ఇవ్వాలని కూడా ఒత్తిడి తేలేదు. తనకు తానే అన్ని ఫార్మట్స్ కు రిటైర్మెంట్ ఇచ్చుకున్నాడు.
facebook.com/story.php?story_fbid=1205297948296450&id=100064487690714&post_id=100064487690714_1205297948296450&rdid=8r3fzUXub1iBQSN5&share_url=https%3A%2F%2Fwww.facebook.com%2Fshare%2Fp%2F19pmUFdqEL%2F#