Priyanka jawalkar (source: Instagram)
ప్రముఖ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కలవరంఆయే అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Priyanka jawalkar (source: Instagram)
ఆ తర్వాత 2018లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో మంచి ఇమేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
Priyanka jawalkar (source: Instagram)
ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ లో జన్మించిన ఈమె ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చివరిగా మ్యాడ్ స్క్వేర్ సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా మారిన విషయం తెలిసిందే.
Priyanka jawalkar (source: Instagram)
ఈమధ్య గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రియాంక జవాల్కర్.. తాజాగా చీరకట్టులో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
Priyanka jawalkar (source: Instagram)
తాజాగా బ్లూ కలర్ చీరలో కనిపించిన ప్రియాంక.. ఈ ఫోటోల కింద క్యాప్షన్ కూడా జోడించింది. ఫ్యూచర్లో రాబోయేవాడి కోసం ఈ లుక్ అంటూ క్యాప్షన్ జోడించడంతో ముందుగానే కాబోయే వాడిని చూసుకున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Priyanka jawalkar (source: Instagram)
మరి కొంతమంది ప్రియాంక పెళ్లికి సిద్ధమయింది అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.