Akhanda 2 Postponed: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్‌పై కొన్ని రోజలు ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్. మరీ చెప్పిన తేదీకి బాలయ్య వస్తాడా? రాడా? అనే ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీనికి కారణం అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ కూడా ఉంది. మరోవైపు షూటింగ్‌లో బోయపాటి, బాలయ్య కాస్తా పడటం లేదనే ప్రచారం ఉంది. వీటి మధ్య అఖండ 2 ఆగమనం ఉంటుందా? ఉండదా? అనే ఆసక్తిగా మారింది. అయితే ఈ మూవీ వాయిదా పడేందుకే ఎక్కువ అవకాశం ఉందని సినీవర్గాల చెబుతూ వస్తున్నాయి.
అఖండ 2 వాయిదా?
కానీ, ఇటీవల మూవీ టీం ఓ ట్వీట్‌తో సెప్టెంబర్ 25న వస్తామని తేల్చి చెప్పాయి. కానీ, పరిస్థితులు చూస్తే మాత్రం అఖండ 2 వాయిదా పడేలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రూమర్సే నిజం అయ్యాయి. అఖండ 2ని వాయిదా వేయాలని మూవీ టీం, మేకర్స్ నిర్ణయం తీసుకుందట. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. కాగా బాలయ్య-బోయపాటి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబోలో వచ్చిన సినిమాలన్ని హిట్స్, బ్లాక్‌బస్టర్స్ హిట్సే. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ కాంబోకు అఖండ 2 సక్సెస్ చాలా కీలకంగా మారింది.
కారణమిదేనా..
ఈ కాంబో నాలుగవో హిట్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఈ సినిమాకు ఓజీ మూవీ పోటీ ఉంది. పైగా మూవీ అవుట్ పుట్ చూసిన బాలయ్య కాస్తా అసంతృప్తి చెందారట. మూవీలోని కీలక సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాలయ్య నచ్చలేదట. దీంతో బోయపాటి సందేహంలో పడ్డారట. ఆ సీన్స్ రీషూట్ చేయాలా? మార్పులు చేర్పులు చేయాలనే సందేహంలో ఉన్నారట. ఈ క్రమంలో మూవీని వాయిదా వేయక తప్పలేదట. దీంతో అఖండ 2ని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే డేట్‌ని మేకర్స్ కూడా ఫిక్స్ చేశారట. ప్రస్తుతం ఈ డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది. అంతా ఒకే అయితే త్వరలోనే దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రానుంది.
డిసెంబర్ 5న అఖండ 2 వస్తుందని ముందు నుంచి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ రూమర్సేనే మూవీ టీం నిజం చేస్తోందనిపిస్తోంది. మొత్తానికి అఖండ 2 వాయిదా పడుతుందనే క్లారిటీ రావడంతో అభిమానులు కాస్తా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ డేట్‌కి పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో.. బాలయ్య సింగిల్ వచ్చే బాక్సాఫీసుని షేక్ చేస్తాడంటున్నారు. డిసెంబర్ 4న టాలీవుడ్ బాక్సాఫీసు షేక్ అవ్వాల్సిందే అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు. కాగా అఖండలో బాలయ్య అఘోరగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో సౌండ్ బాక్సులు దద్దరిల్లాయి. ఈసారి కూడా థమన్ తన మ్యూజిక్ ఎలాంటి మాయ చేయబోతున్నాడనా అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.