Rashmi Gautam: రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేసి మంచి గుర్తింపు పొందింది.

రష్మి గౌతమ్ ఒక సినీ నటి.. అలాగే టీవీ యాంకర్.. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది.

సినిమాలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ టీవి మీడియాకి సొంతం. సినిమాల్లో అవకాశాలు లేక ఎంతో మంది టాలెంట్ ఆర్టిస్టులు టీవీ మీడియాలోనే సెటిల్ అయిపోతున్నారు.

బయటకి వస్తే హీరో, హీరోయిన్ లతో ఈక్వల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నవారిలో యాంకర్లు ఎంతో మంది ఉన్నారు.

ముఖ్యంగా కామెడీ షోలు, రియాలిటీ షోలు అయితే యూత్‌లో చాలా అభిమానం ఉంది. సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైన తర్వాత టీవీ యాంకర్లకు యూట్యూబ్‌లో ఓ సెపరేట్ అభిమానం ఏర్పడింది.

అలా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ రష్మి. గౌతమ్.. తనకోసమే షో చూసే అభిమానులను సంపాదించుకుంది.

రష్మి 2002 లో సవ్వడి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు.

తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా వచ్చిన హోళీ సినిమాలో హీరోయిన్‌కి చెల్లెలుగా నటించింది. తర్వాత యువ అనే సీరియల్‌లో నటించింది.

చలాకీ, కండెన్, చారు శీల, గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్, భోలా శంకర్ వంటి పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.

ఆ తర్వాత సుడిగాలి సుధీర్‌తో ఎక్కువగా యాంకర్‌గా షోలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.

రష్మి ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా వైలెట్ కలర్ లెహంగాలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.