Lokesh Kanagaraj Kaithi 2: తమిళ సినీ ఇండస్ట్రీలో సరైన హిట్స్ లేని టైంలో… ఖైదీ మూవీ వచ్చింది. కోలీవుడ్‌ను షేక్ చేసింది. తర్వాత మాస్టర్.. ఆ తర్వాత విక్రమ్… కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. దెబ్బకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను తమిళ ఆడియన్స్ అందరూ నెత్తిన పెట్టుకున్నారు. అహో… ఓహో.. అంటూ ప్రశంసలు కురిపించారు. తర్వాత విజయ్ దళపతితో లియో అనే మూవీ చేశాడు. భారీ హోప్స్ పెట్టుకున్న ఈ మూవీ అంచనాలను మాత్రం అందుకోలేదు.
కానీ, కమర్షియల్‌గా కొంతమేర సక్సెస్ అయింది. ఇక ఇటీవల కూలీ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడింది. రజనీకాంత్ మూవీ అంటేనే సాధారణంగానే హైప్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ కోలీవుడ్‌లో అహో.. ఓహో అంటూ ప్రశంసల వర్షం కురిపించుకున్న లోకేష్ ఇక్కడ డైరెక్టర్. ఇంకేం ఉంది. సినిమా అత్యంత భారీ అంచనాలు ఉండేవి. కానీ, రిలీజ్ తర్వాత… లోకేష్ పని అయిపోయింది అనే మాటలు స్వయంగా రజనీకాంత్ అభిమానులే అన్నారు. అంతలా మారిపోయింది లోకేష్ పరిస్థితి. కూలీ ముందు వరకు లోకేష్తో సినిమా చేయాలని స్టార్ హీరో లంత ఆసక్తి చూపించారు.
లోకేష్ సినిమాలో ఇచ్చే ఎలివేషన్స్ హీరోల క్రేజ్ను మరో మెట్టు ఎక్కిస్తుంది. అందుకే లోకేష్తో సినిమా అయినా, లేదో ఓ కీ రోల్ చేసిన తమ క్రేజ్ పెరుగుతుందనేది హీరోల నమ్మకం. కానీ, కూలీ ఎఫెక్ట్తో లోకేష్ని నమ్మడంలో తడబడుతున్నారట. కమల్ హాసన్, రజనీకాంత్ లో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హీరోలు మల్టీస్టార్ మూవీ చేయాలని నిర్ణయించుకుని, దర్శకత్వ బాధ్యతలను లోకేష్ కి ఇచ్చారు. దాదాపు ఈ సినిమా ఫైనల్ కూడా అయ్యింది. కూలీ తర్వాత ప్రకటన ఇచ్చి సెట్స్ పైకి రావాల్సి ఉంది. ఏమైందో తెలియదు ఇది ఆగిపోయింది. కమల్-రజనీలు లోకేష్ కి హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది. దీనికి కూలీ ఫలితమే కారణమని ఇండస్ట్రీలో గుసగుస.
కమల్-రజనీ సినిమా కోసం లోకేష్ ఖైదీ సీక్వెల్ని పక్కన పెట్టాడు. దీంతో కార్తీ తన కాల్షిట్ని ఇతర డైరెక్టర్లకు కేటాయించాడు. సుందర్. సితో ఓ సినిమాకు కమిటయ్యాడు. కూలీ టైంలోనే ఆమిర్ ఖాన్‌తో కూడా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. కమల్-రజనీ మల్టీస్టారర్, ఖైదీ 2 తర్వాత ఆమీర్ తో మూవీకి కూడా కమిటైయ్యాడు. కానీ, కూలీ ఎఫెక్ట్ తో అది కూడా వెనక్కి వెళ్లింది. ఆమిర్ కూడా లోకేష్ కి హ్యాండ్ ఇచ్చాడట. ఇప్పుడు ఖైదీ 2 అయినా ఉంది కదా అనుకుంటే కార్తీ డేట్స్ అసలు సర్దుబాటు చేయడం లేదట. అనుకుంటే ఖైదీ 2కి డేట్స్ ఇవ్వోచ్చు. కానీ, ఇప్పుడు ఖైదీ 2 చేసేందుకు కార్తీ కూడా ఆసక్తి చూపడం లేదట. సుందర్ సి తో సినిమా పూర్తయ్యేకే ఖైదీ సీక్వెల్ చేస్తాననని అంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో లోకేష్ కి కార్తీ కూడా హ్యాండ్ ఇచ్చాడంటూ కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చూస్తుంటే ఇప్పట్లో ఖైదీ 2 వచ్చే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది.