E-Paper
Advertisement

YouTube New Feature: యూట్యూబ్ షాకింగ్ డెసిషన్.. ఇక నుంచి అలా చెయ్యలేరు!

YouTube New Feature: యూట్యూబ్ షాకింగ్ డెసిషన్.. ఇక నుంచి అలా చెయ్యలేరు!
Advertisement

YouTube New Feature: ప్రస్తుతం చిన్న పెద్దా అని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. దీంతో వాళ్లు సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే.. గంటలు తరబడి షార్ట్ వీడియోలు చూసుకుంటూ యూజర్లు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఒక్క షార్ట్ వీడియో చూడాలని యాప్ ఓపెన్ చేసి, వారికే తెలీకుండా గంటల తరబడి స్క్రోల్ చేస్తూ వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఈ ‘ఎండ్‌లెస్ స్క్రోలింగ్’ వల్ల ముఖ్యమైన పనులు పక్కకు పోయి, డిజిటల్ వెల్‌బీయింగ్‌ దెబ్బతింటోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్, యూజర్లలో మంచి అలవాట్లను ప్రోత్సహించడానికి ఈ వినూత్నమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

సెట్టింగ్స్‌తో నియంత్రణ..

యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ పేరు ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’. పేరు సూచించినట్లే, ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ యాప్‌లోని సెట్టింగ్స్‌లో రోజూ షార్ట్ వీడియోలు ఎంతసేపు చూడాలో ఒక సమయ పరిమితిని సెట్ చేసుకోవచ్చు. ఉదా: ఎవరైనా ఒక గంట సమయాన్ని నిర్ణయించుకుంటే.. ఆ సమయం పూర్తవగానే షార్ట్స్ ఫీడ్ ఆగిపోతుంది. ఇకపై అనవసరంగా ఎక్కువసేపు షార్ట్స్ చూడటాన్ని ఈ ఫీచర్ సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఈ ఫీచరేదో బాగుంది కదూ!

నోటిఫికేషన్ ద్వారా అలర్ట్..

Advertisement

యూజర్ నిర్ణయించుకున్న ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’ సమయం పూర్తయిన వెంటనే, యూట్యూబ్ యాప్ స్క్రీన్‌పై ఒక నోటిఫికేషన్ లేదా ప్రాంప్ట్ చూపిస్తుంది. ఆ రోజుకు షార్ట్స్ స్క్రోలింగ్ నిలిపివేయబడిందని ఈ నోటిఫికేషన్ యూజర్‌కు గుర్తుచేస్తుంది. అయితే, ప్రస్తుతం ఈ నోటిఫికేషన్‌ను యూజర్‌ అవసరాన్ని బట్టి డిస్మిస్ చేసే అవకాశం ఉన్నా, ఇది తమ స్వంత నియంత్రణను గౌరవించేలా యూజర్లను ప్రోత్సహించడం ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం. డిజిటల్ ప్రపంచంలో సమయ నిర్వహణకు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు.

త్వరలో పేరెంటల్ కంట్రోల్స్..

నిజానికి, యూట్యూబ్‌లో ‘టేక్ ఏ బ్రేక్’, ‘బెడ్‌టైమ్ రిమైండర్స్’ వంటి సమయ నియంత్రణ ఫీచర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే, షార్ట్స్ ఫీడ్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’ ఫీచర్, యూజర్లు మరింత స్పష్టమైన, నిర్మాణపరమైన నియంత్రణను పాటించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, త్వరలో ఈ ఫీచర్‌ను పేరెంటల్ కంట్రోల్స్‌‌కు కూడా అనుసంధానించాలని యూట్యూబ్ యోచిస్తోంది. దీనివల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు షార్ట్స్ చూసే సమయాన్ని కచ్చితంగా నియంత్రించడానికి వీలవుతుంది. ఈ చర్య డిజిటల్ వెల్‌బీయింగ్‌ వైపు యూట్యూబ్ తీసుకున్న గొప్ప నిర్ణయంగా ప్రశంసలు అందుకుంటోంది.

Advertisement

 

 

 

 

 

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×