Ahmedabad News: గుజరాత్‌లోని ఊహించని ఘటన జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి అనూహ్యంగా బయటపడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, యువకుడి గురించిన విషయాలు తెలిసి చాలామంది షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
అహ్మదాబాద్‌లో ఊహించని ఘటన
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సిటీలో ఊహించని ఘటన జరిగింది. నోబెల్‌నగర్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. ఇంకా మెయిన్‌రోడ్డు మీదకు రాలేదు. ఈలోగా చిన్నారి కుడి వెపు నుంచి అకస్మాత్తుగా ఓ కారు వచ్చింది. ఏకంగా బాలికపై నుంచి దూసుకెళ్లింది. వాహనాన్ని గమనించిన సమీప ఇళ్లలోని వారినుంచి గట్టిగా కేకలు వినిపించాయి.
ఆ గందరగోళం విన్న తర్వాత యువకుడు కారును ఆపాడు. ఈలోగా కారు కింద నుంచి ఆ చిన్నారి పాకుతూ బయటకు వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాణాంతకమైన ప్రమాదం నుంచి బయటపడింది. వెంటనే బాలికను తనిఖీ చేసి, ఏమైనా గాయాలు అయ్యాయా అని దగ్గరకు వచ్చి పరిశీలించాడు. ఈలోగా మరికొందరు పరుగెత్తుకుంటూ వచ్చారు.
చిన్నారిపైకి దూసుకెళ్లిన కారు, మైనర్ కారు డ్రైవింగ్
చిన్నారి తండ్రితో కారు యువకుడు మాట్లాడుతుండగా బాలిక తల్లి వచ్చి లాగి చెంప ఛెళ్లుమనిపించింది. బాలుడికి నాలుగు లెంపకాయలు వేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో బాలుడు జారుకున్నాడు. విచిత్రం ఏంటంటే బాలుడి వయస్సు 17 ఏళ్లు. ఒక్కమాటలో చెప్పాలంటే మైనర్. డ్రైవింగ్ లైసెన్సు కూడా లేదు. అలాంటిది ఏకంగా వీధుల్లో కారు నడిపాడు.
ALSO READ: మద్యం మత్తులో టీచర్ బీభత్సం.. బైక్ ని ఈడ్చుకెళ్లిన కారు, వీడియో వైరల్
చిన్నారి బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే అక్కడ పరిస్థితి మరోలా ఉండేది. ఆ కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేదు. ఆ కారు యజమానిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైనర్లు కారు నడప వద్దని పోలీసులు పదేపదే చెబుతుంటారు అందుకే. ఈ తతంగమంతా ఆపోజిట్‌లో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇప్పుడు ఆ దృశ్యాలు నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి.
#Ahmedabad : નોબલનગર વિસ્તારન શિવ બંગલામાં ચોંકાવનારી ઘટના સામે આવી
3 વર્ષની બાળકી બંગલા કોમન પ્લોટમાં રમી રહી હતી તે દરમિયાન સગીરવયનો કિશોર ગાડી લઈને આવી બાળકી પર ચડાવી દીધી.
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી#Accident | @PoliceAhmedabad pic.twitter.com/MgmHbijbLQ
— HIMANSHU PARMAR (@himanshu_171120) October 29, 2025